1 అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. 2 సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి 3 ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి–యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి.
యేసును విడుదల చేయించడంలో విఫలమైన పిలాతు, తన సైనికులచేత అవమానించబడటానికి ఆయనను ప్రెటోరియం లోపలికి తీసుకువెళ్ళాడు. సిలువ నుండి ఆయనను రక్షించడానికి అతను మరో పథకాన్ని పన్నాడు.
19:1
అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను.
పిలాతుచే యేసును కొరడాలతో కొట్టించడం అనేది యూదులతో రాజీ పడటానికి చేసిన మరో ప్రయత్నం. రోమన్లు లోహపు ముక్కలు పొదిగిన తోలు కొరడాను ఉపయోగించేవారు. ఈ దెబ్బలు చాలా క్రూరంగా ఉండేవి కాబట్టి, సామ్రాజ్యం ఏ రోమన్‌ను కూడా ఈ దెబ్బలకు గురికావడానికి అనుమతించలేదు. యేసుకు మరణశిక్ష విధించాలని యూదులు కోరకుండా వారిని శాంతింపజేయడానికి ఇది చేయబడింది.
19:2
సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి
యేసు రాజు అను సంగతిని ఆ సైనికులు ఆయన తలమీద “ముళ్ళ కిరీటము” పెట్టి ఎగతాళి చేసిరి. అది ఆయన “రాజ కిరీటము”. ఆ ముళ్ళను ఆయన తలలో గుచ్చిరి, దానివల్ల ఆయనకు చాలా నొప్పి కలిగింది. ఈ కిరీటము అని పిలవబడే దాని నుండి ధారావాహికగా రక్తస్రావం అయ్యింది.
ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి
యేసును మరింతగా ఎగతాళి చేయడానికి వారు ఆయనకు “ఊదా రంగు వస్త్రము” అనగా ఒక సైనిక వస్త్రమును తొడిగిరి. ఆయన రాజు అను సంగతిని వారు ఎగతాళి చేసిన మరో విధానం ఇది.
19:3
ఆయనయొద్దకు వచ్చి–యూదుల రాజా, శుభమని చెప్పి
ఆ సైనికులు బూటకపు గౌరవముతో యేసును అవహేళనగా ఎగతాళి చేసిరి. ఇది ప్రభువును పూర్తిగా ఎగతాళి చేయడమే.
ఆయనను అర చేతులతో కొట్టిరి
రోమా సైనికులు యేసును తమ చేతులతో కొట్టిరి (మత్తయి 27:30). తనకు ఒక రాజ్యం ఉందన్న ఆయన వాదనను ఎగతాళి చేయడానికి ఇది వారి మార్గం.
సూత్రం:
పాపము కొరకు క్రీస్తు పడిన శ్రమలో అవమానం ఒక భాగం.
అనువర్తనం:
యేసు పాపమునకు మరియు లోక పాపములకు ప్రాయశ్చిత్తం చేయబోతున్నాడు కాబట్టి, పాపము దాని సంపూర్ణ ఘోరత్వంతో కనబడటం అవసరం. పాపము మానవాళి యొక్క గొప్ప వినయం, మరియు యేసు ఆ వినయాన్ని తనపై తాను ధరించుకున్నాడు.
యేసు సిలువతో పాటు అనేక అవమానాలను అనుభవించాడు (యెషయా 50:6; 52:12-53:6). ఇతర విషయాలతో పాటు, సైనికులు మన ప్రభువుపై ఉమ్మివేశారు (మత్తయి 27:30). వారు విశ్వ ప్రభువుతో పరిహాసం చేశారు. ఇది యూదుల పట్ల మరియు యేసు పట్ల కూడా చూపిన అవమానం.
