మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థనచేయవలెను.
యాకోబు ఇప్పుడు తన జీవితంలో సుదీర్ఘమైన పాపం కారణంగా అనారోగ్యానికి గురైన ఒక విశ్వాసి యొక్క ప్రత్యేక సంధర్బము వైపు తిరుగుతున్నాడు. అతను మరణకరమైన పాపమునకు పాల్పడే అంచున ఉన్నాడు (5:20).
మీలో ఎవడైనను రోగియై యున్నాడా?
“రోగి” అనే పదానికి బలం లేకపోవడం, బలహీనంగా ఉండటం అని అర్ధము. ఆధ్యాత్మిక అనారోగ్యం వలన బలహీనంగా ఉండవచ్చు, అసమర్థ స్థితి అను భావన. క్రొత్త నిబంధన “రోగము” అను పదమును భావోద్వేగ లేదా ఆధ్యాత్మిక శక్తిహీనతను సూచించడానికి పద్నాలుగు సార్లు ఉపయోగిస్తుంది (అపో.కా. 20:35; రోమా 4:19; 8:3; 14:1-2; 1కొరిం. 8:11–12; 2 కొరిం. 11:21, 29; 12:10; 13:3–4, 9).
మీ శరీర బలహీనతనుబట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. (రోమా 6:19)
క్రొత్త నిబంధన ఈ శారీరక అనారోగ్యం అనే పదాన్ని మూడుసార్లు మాత్రమే ఉపయోగిస్తుంది (ఫిలిప్పీ. 2:26–27; 2తిమో 4:20). తరువాతి వచనములో “రోగము” అనే పదానికి బలహీనత (5:15) అని అర్ధం. కాబట్టి, ఇక్కడ ఈ వచనములో ఆధ్యాత్మిక వైఫల్యం కారణంగా బలహీనత. యాకోబు పత్రిక పాఠకులు, ఆధ్యాత్మిక యుద్ధంలో ఓడిపోయినవారు మరియు శారీరక అనారోగ్యం యొక్క దేవుని క్రమశిక్షణలో ఉన్నారు. పాపము తరువాతి వచనము (5:15)లో స్పష్టంగా ఉంది.
ఒక క్రైస్తవుడు తన పాపాన్ని ఒప్పుకొని వ్యవహరించకపోతే, దేవుడు అతన్ని శారీరక అనారోగ్యం లేదా మరణం (1:15, 21; 5:20) లో ఉంచుతాడనే ఆలోచనను యాకోబు సూచించాడు. శారీరక అనారోగ్యం కొన్నిసార్లు దీర్ఘకాలిక పాపాత్మకమైన ప్రవర్తన నుండి వస్తుంది.
అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను;
తనకు ఆధ్యాత్మికంగా సహాయం చేయమని పెద్దలను అత్యవసరంగా అభ్యర్థించమని యాకోబు రోగులను ప్రోత్సహిస్తున్నాడు. “పెద్దలు” అనే పదం నాయకుడికి మరో పదం. స్థానిక సంఘములో నాయకుడు ఆధ్యాత్మికంగా అర్హత కలిగినవాడు మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణలో ఇతరులను నడిపించే పరిపక్వతతో ఉన్నాడు (అపో.కా.14:23; 20:17; ఫిలెమోను1:1; 1తిమో. 5:17; తీతుకు 1:5).
వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థనచేయవలెను.
ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన నాయకత్వంలో మన ఆధ్యాత్మిక ఓటమికి మనము సహాయం కనుగొంటాము.
నియమము:
పడిపోయిన విశ్వాసులను పునరుద్ధరించడంలో దేవుడు ఆనందిస్తాడు.
అన్వయము:
నిరుత్సాహపడిన మరియు బాధపడే విశ్వాసిని ప్రోత్సహించే పనిలో దేవుడు ఉన్నాడు. అతను ఆధ్యాత్మిక పునరుద్ధరణ ద్వారా దీన్ని చేస్తాడు. ఒక క్రైస్తవుడు పాపం చేస్తే, దేవుడు అతన్ని క్షమించును. కొన్నిసార్లు విశ్వాసులకు వారి పునరుద్ధరణకు సహాయం చేయడానికి పరిణతి చెందిన క్రైస్తవ నాయకత్వం అవసరం.
మీరు నైతికంగా ఓడిపోయి, నిరుత్సాహపడితే, మీ ఆధ్యాత్మిక అచేతనత్వము నుండి మిమ్మల్ని అధిగమించడానికి దేవుడు మీకు నిరంతర కృపను ఇస్తాడు.
సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను. ఒకని భారముల నొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. (గలతీ 6:1,2)
దీర్ఘకాలికముగా అంగీకరించని పాపం కారణంగా దేవుడు కొన్నిసార్లు విశ్వాసిని మరణానికి అప్పగిస్తాడు (ద్వితీ 28:22,27; యోహాను 5:14; 1కొరిం 11:30).