నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశముతోడనిగాని భూమితోడనిగాని మరి దేని తోడనిగాని ఒట్టుపెట్టుకొనక, మీరు తీర్పుపాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను.
అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను.
సూటిగా మాట్లాడటం తప్ప మరేదైనా దేవుని చిత్తానికి వెలుపల ఉంటుంది. అబద్దాలు మనుషులకు అలవాటు. అబద్ధాలకు జనకుడైన వారి తండ్రి నుండి వారు ఈ అలవాటును పొందుతారు.
మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు. (యోహాను 8:44)
న్యాయస్థానాలలో మనకు ప్రమాణాలు చేయటానికి కారణం, చట్టబద్ధంగా నిర్దేశించిన వారి పదం ఆధారంగా వారు ఎక్కడ నిలబడతారో ప్రకటించమని ప్రజలను బలవంతం చేయడం. మరోవైపు, క్రైస్తవులకు వారి మాటను ధృవీకరించడానికి ప్రమాణ ప్రక్రియ అవసరం లేదు.
మీరు తీర్పుపాలు కాకుండునట్లు
మనము సూటిగా మాట్లాడటానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే దేవుని తీర్పును మనము ఆహ్వానిస్తాము. దేవునిని తప్పుడు ప్రమాణంలో భాగస్తునిగా చేస్తే, ఆ విశ్వాసి దైవిక శిక్షలో పడతాడు.
నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు. (నిర్గమ 20:7)
ఈ క్రింది భాగం విశ్వాసి దైవిక క్రమశిక్షణలో ఎలా పడుతాడో చూపిస్తుంది
మరణం, 5:14-15
ఆరోగ్యం కోల్పోవడం, 5:16
నియమము:
సమగ్రతను కాపాడుకోవడానికి మన వాక్కును కాపాడుకోవాలి.
అన్వయము:
క్రైస్తవుడు తాను చెప్పినదాని యొక్క నిజాయితీని మంజూరు చేయమని దేవుని ప్రార్థించే స్థాయికి వెళ్ళకూడదు. అతని మాట నిజాయితీగా, సూటిగా ఉండాలి. అందుకే ప్రమాణ స్వీకారం చేయడాన్ని ఆపమని యాకోబు తన పాఠకులకు ఆజ్ఞాపించాడు. చిత్తశుద్ధి ఉన్నవారు ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే, గతంలో తమ మాటను నిలబెట్టిన కరనాన్న, ప్రజలు వారు చెప్పేది నమ్ముతారు.
మన సాధారణ సంభాషణలలో మనం ఎలా సంభాషిస్తామో అనునది దేవుని ఆందోళన. దుర్బలత్వం మరియు ఒత్తిడి సమయాల్లో, తప్పుడు ప్రతిజ్ఞ చేయడం సులభం. మన ప్రకటనకు దారుణమైన వాగ్దానాన్ని జతచేయడం కంటే మనం చెప్పేదానిలో మనం నిజాయితీగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. యధార్ధత ఎల్లప్పుడూ మన వాక్కును కాపాడగలగాలి.