Select Page
Read Introduction to James యాకోబు

 

ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?

 

పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?

అలంకారిక రూపంలో “నీవెవడవు” అనుమాట  యాకోబు  తీర్పు చెప్పే పాపాన్ని ఎలా చూస్తాడో దాని యొక్క గొప్పతనాన్ని నొక్కి చెబుతుంది. “ మీరు ఎవరు అని మీరు అనుకుంటున్నారు? దేవుడవని అనుకుంటున్నవా?” దేవుని తీర్పు యొక్క పరిపూర్ణ ప్రమాణముకు భిన్నమైన ప్రామాణికం తో ఇతరులను తీర్పు తీర్చునపుడు దేవునికంటే మనకు ఎక్కువగా తెలుసు అనుకుంటాము.

నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణహానిచేయ చూడకూడదు, నేను యెహోవాను. (లేవీ 19:16)

పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.

అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము. (రోమా 14:4,10)

నియమము:

తోటి క్రైస్తవుల ఉద్దేశాలను తీర్పు చెప్పేటప్పుడు మనల్ని మనం దేవుని స్థానంలో ఉంచుకుంటాము.

అన్వయము:

తోటి క్రైస్తవులను తీర్పు తీర్చడం చాలా మంది క్రైస్తవులకు ఇష్టమైన ఇండోర్ క్రీడ. నిజమైన వినయం ఇతరులను అతిగా తీర్పు ఇవ్వదు ఎందుకంటే తీర్పు చెప్పే హృదయంలో అహంకారం ఉంటుంది. తీర్పుతీర్చే అహంకారం దేవుని స్థానాన్ని స్వాధీనం చేసుకుంటుంది (రోమా 14:1-13). ఈ పాపం కేవలం దేవునికి చెందిన ఒక హక్కును ఊహిస్తుంది ఎందుకంటే ఇది తీర్పు తీర్చబడిన వ్యక్తి యొక్క ఉద్దేశాలను తెలుసుకోడానికి ప్రయత్నిస్తుంది.

ప్రభువు మొత్తం ధర్మశాస్త్రాన్ని ఒక వచనములో  “నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము” అని సంక్షిప్తీకరించాడు. మనం ఇతరులపై తీర్పులో కూర్చుంటే,మనము చట్టంపై తీర్పులో కూర్చుంటాము. దేవుడు మన పొరుగువారిని ప్రేమించమని చెప్తాడు, కాని మనం పొరుగువానికి తీర్పు తీర్చినట్లయితే, మనము దేవుని స్థానాన్ని స్వాధీనం చేసుకున్నవరమౌతాయము. మనము దీన్ని చేసినప్పుడు, మనం ఎక్కువ అన్యాయానికి మరియు తిరుగుబాటుకు గురవుతాము.

Share