Select Page
Read Introduction to James యాకోబు

 

వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.

 

మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.

సరియైన ఆనందమును ఖండించలేదు కానీ మన పాపముల విషయము తీవ్రముగా ఒప్పుకోలుచేయవలసిన సమయములో ఆనందించుటను యాకోబు ఖండిస్తున్నాడు. 1:2 మరియు 5:13 నుండి మనం ఆనందాన్ని అనుభవించాలని దేవుడు కోరుకుంటాడు అని స్పష్టమౌతుంది. నిజమైన ఆనందం ప్రభువుతో సహవాసం నుండి వస్తుంది.

మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. (యాకోబు 1:2)

 “చింత” అనే పదానికి నిరాశ, అవమానం, త్రోసివేయబడుట అని అర్ధము. పాపం యొక్క ఉనికి ఆత్మీయ విశ్వాసిలో అసంతృప్తి మరియు నిరాశకు కారణముగా ఉండాలి.

నియమము:

మన ఆనందం యొక్క మూలం మన నిజమైన హృదయాన్ని మోసం చేస్తుంది.

అన్వయము:

విశ్వాసి యొక్క ఆనందం అతని తరపున క్రీస్తు చేసిన కార్యముయొక్క ఫలితం. మన పాపముల విషయము మనం ఏడవాలి. ఈ ఏడుపు దేవుని అనుగ్రహాన్ని పొందడంకోసము కాదు; మనకు దేవుని అనుగ్రహము ఉంది. మన కోసం ఎంతో చేసిన వ్యక్తిని ఉల్లంఘించినందున  దుఃఖించుట.

మన పాపంపై మన దుఃఖాన్ని తిరిగి పొందాలి. మనం యే విషయము సంతోషిస్తున్నాము లేక యే విషయమై దుఃఖిస్తున్నాము అనునది మన నిజమైన హృదయాన్ని వెల్లడిస్తుంది. ఆధ్యాత్మిక క్రైస్తవుడు రెండు ఆత్మల హృదయంలో ఆనందాన్ని పొందడు, ఎందుకంటే అది అతని విశ్వాసాలను విభజిస్తుంది. ప్రభువును మరియు సాతానును ఒకే సమయంలో అనుసరించడం ద్వారా మనం ఆనందాన్ని పొందలేము. ఆధ్యాత్మిక ఆరోగ్యం వ్యక్తిగత పాపముపట్ల నిరాశను తెస్తుంది.

సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది. మా తలమీదనుండి కిరీటము పడిపోయెను; మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ. (విలాప 5:15,16)

Share