వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.
యేడువుడి,
8 వ ఆదేశం “యేడువుడి”. “ఏడుపు” అంటే రోధించుట, విలపించడం. ఈ పదానికి ప్రాధాన్యత శబ్దం మీద ఉంది. ఏడుపు అనేది దుఃఖం యొక్క బాహ్య వ్యక్తీకరణ.
అప్పుడు వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచుపౌలు మెడమీదపడి అతనిని ముద్దుపెట్టుకొని, వారు ఓడవరకు అతనిని సాగ నంపిరి. (అపో.కా. 20:37,38)
నియమము:
బాహ్య ఏడుపు అంతర్గత దుఃఖానికి సంకేతం.
అన్వయము:
ఏడుపు అనేది అంతర్గత దుఃఖానికి బాహ్య సంకేతం. మన పాపమును బట్టి మనం గట్టిగా యేడ్చేసందర్భాలు ఉండవచ్చు.
అందుకు అతడు– ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను కనుక–కోడి కూయకమునుపు నీవు నన్నెరుగ నని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి యేడ్చెను. (మత్తయి 26:74,75)