వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.
ఈ వచనము10 ఆదేశాలలోని ఐదు కలిగి ఉంది. ఈ వచనము మనలను పశ్చాత్తాపానికి పిలుస్తుంది మరియు చాలా ముఖ్యమైన గమనికను తాకుతుంది.
వ్యాకుల పడుడి
మనము ఇప్పుడు 10 ఆజ్ఞలలో 6 వ ఆజ్ఞకు వచ్చాము – “విలపించు.” “వ్యాకుల పడుడి” అనే పదానికి బాధను అనుభవించుట, కష్టపడి పనిచేయడం అని అర్ధం. ఈ పదం భరించడం, మరియు కఠినమైన అనే రెండు పదాల నుండి వచ్చింది. కష్టాలను అనుభవించడం, విరిగిపోయిన అనుభవము అను భావమును కలిగి ఉంది.
నియమము:
ఒక ఆధ్యాత్మిక విశ్వాసి పాపాన్ని హేతుబద్ధీకరించడు కాని దానిని అంగీకరించి దానిగురించి దుఃఖిస్తాడు.
అన్వయము:
ఇక్కడ విరిగిన అనుభవము, విశ్వాసి జీవితంలో పాపమును గూర్చిన ఒప్పుకోలు. దేవుడు మన మూలాల వరకు కదిలించేవారకు మన అంతిమ విలువలను మార్చుకోము.
మన పాపం విషయము విచారించుటకు తగిన సమయం ఉంది. మన సంస్కృతి ఏ విధమైన విచారాన్ని ఖండిస్తుంది కాని దేవుడు చేయడు; మన పాపంవిషయము మనం వ్యాకులాన్ని అనుభవించాలని ఆయన కోరుకుంతున్నాడు. మన పాపానికి మనం ఆత్మాశ్రయంగా చెల్లించాలని ఆయన కోరుకోడు కానిపాపమును ఒప్పుకోవాలని కోరుకుంటాడు. ఆత్మాశ్రయ అపరాధభావన క్రీస్తు శిలువపై చేసిన పనిని దోచుకుంటుంది. బాహ్యమైన అపరాధభావన మన పాపం గురించిన సత్యాన్ని ఎదుర్కోవటానికి వీలు కల్పిస్తుంది.
దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. (2కొరిం 7:10)
మన నిత్యశిక్షకు బదులుగా యేసు మూల్యము చెల్లించాడు- అది పూర్తయింది. అయినప్పటికీ, మన పాపానికి మనము బాధ్యులము – బాధ్యత వహించడము, గుర్తింపు మరియు ఒప్పుకోలు. యేసు బాధ్యత పాపానికి మూల్యము చెల్లించటం; మన పాపాన్ని గుర్తించి అంగీకరించడం మన బాధ్యత. మన పాప భారం నుండి బయటపడాలంటే, మనం దానిని నిర్లక్ష్యం చేయకుండా వ్యవహరించాలి. పూర్తి ఒప్పుకోలు ఎల్లప్పుడూ పాపంపై వ్యాకులమును తెస్తుంది.
వ్యాకులమును గూర్చిన ఈ ఆజ్ఞాకు వ్యక్తిగత సమస్యల గురించిన దిగులుతో సంబంధం లేదు. మత సన్యాసిగా మారడాన్ని కూడా సూచించడము లేదు. ‘విచారం’ అనేది దేవుని చిత్తానికి వెలుపల విలువలను అనుసరించకుండుట. తీవ్రమైన పాపానికి పాల్పడేవారి పట్ల ఉదాసీనతకు ఇది ధ్రువ విరుద్ధం. పాపం పట్ల ఉదాసీనతపై ఇది విరిగిన అనుభవము.
అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. (కొలస్సీ 2:23)
సంఘము యొక్క ఆధ్యాత్మిక స్థితి లేదా మన వ్యక్తిగత ఆత్మీయ స్తితి గూర్చి వ్యాకులపడేసమయం ఉంది. మనం పాపం గురించి తీవ్రంగా ఆలోచించకపోతే, పాపం యొక్క తీవ్రత పట్ల ఉదాసీనత కలిగి ఉంటాము.
ఒప్పుకొనని పాపంలో జీవించే క్రైస్తవులు విచారముతో జీవిస్తారు. మనం పాపానికి లొంగిపోయినప్పుడు, మన స్వేచ్ఛను కోల్పోతాము. స్వేచ్ఛ కోల్పోవడం అంటే కష్టాలు. ఈ సందర్భంలో, మనం ఏమి చేసినా, మనము ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక దుఃఖిముతో ముగుస్తాము.