Select Page
Read Introduction to James యాకోబు

 

మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు.

 

గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు.

యాకోబు పత్రిక పాఠకులు వారి అవసరాల గురించి ప్రార్థించలేదు, కాబట్టి వారు అడగని ప్రార్థనలకు సమాధానాలు రాలేదు! వారు తమలో తాము సంప్తృప్తులుగా భావించారు కాబట్టి వారు తమ అవసరాల గురించి ప్రార్థించలేదు.

“అడుగుట” ప్రార్థన యొక్క భావనను తెలియజేస్తుంది (1:5-6). దేవుడు మనం ఆయనను  అడగాలని కోరుకుంటాడు ఎందుకంటే అడగడం అనేది ఆధారపడటం. అవిశ్వాసం కారణంగా వారు దేవునిని అడుగని కారణాన క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక జీవితంలో బలహీనంగా ఉన్నారు. అయినప్పటికీ, సంఘ చరిత్రలో ఏ కాలంలోనైనా ప్రార్థనకు ఉన్న శక్తి నేటిదినమున కూడా ఉంది.

అన్ని శరీరాశాలకు మూలం ఒకే విధంగా ఉంటుంది – దేవుని ప్రణాళికకు విరుద్ధమైన అంతర్గత ఆశలు. మనం ప్రార్థించకపోవటానికి కారణం, మనం స్వయంప్రతిపత్తి దృక్పథం నుండి జీవితాన్ని చేరుకోవడం.

నియమము:

ఆశలమయమైన  జీవిత ధోరణికి పరిష్కారం ప్రార్థనలో ఉంది.

అన్వయము:

శత్రుత్వానికి ఖచ్చితమైన పరిష్కారం ప్రార్థన. మీ సాధారణ సామర్థ్యానికి మించిన దేనినైనా అడగండి. మనుషులను తారుమారు చేయడం కంటే దేవునితో వ్యవహరించడం మంచిది.

ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. (యోహాను 16:24)

శరీర సంబంధులైన క్రైస్తవులు స్వంత ప్రయత్నాల ద్వారా వారి అన్ని అవసరాలను తీర్చుకుంటారు, “నాకు తగినంత విద్య, తగినంత తెలివి తేటలు ఉన్నాయి. నేను దేవునిపై ఎందుకు ఆధారపడాలి? ” అని భావిస్తారు. కానీ మనం తనను అడగాలని దేవుడు కోరుకుంతున్నాడు.

అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, 8తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడును. 9మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా? 10-11మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును. (మత్తయి 7:7-11)

Share