మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు.
పోట్లాడుదురు యుద్ధము చేయుదురు
అన్ని సంఘర్షణలు అంతర్గతముగా పుట్టుకొస్తాయి. హత్య మరియు దురాశ కలిగిన వైఖరి ఎల్లప్పుడూ విశ్వాసులలో వ్యత్యాసాన్ని మరియు అసమ్మతిని ఉత్పత్తి చేస్తుంది
నియమము:
స్థానము కోసం ఆశపడుట విశ్వాసులలో శత్రుత్వాన్ని తెస్తుంది.
అన్వయము:
స్థానము కోసం మరియు హక్కు కోసం ఆశపడుట విశ్వాసులలో శత్రుత్వాన్ని తెస్తుంది. అన్ని సంఘర్షణలు దురాశ నుండి ఉద్భవిస్తాయి. మనము ప్రతికూలంగా ఉండుటవలన గుర్తింపు పొందలేము. ఇతరులను దిగజార్చడం ద్వారా మనకు స్థానము దొరకదు. గుర్తింపు కోసం ఆశపడుట విశ్వాసులలో యుద్ధాలకు మూలం.