మీలో జ్ఞాన వివేకములుగలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.
వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై
“సాత్వికము” అనే పదం వినయానికి వాడే పదం. యాకోబు ప్రస్తావిస్తున్న జ్ఞానం “సాత్వికము” రంగంలో పనిచేసే జ్ఞానం. సాత్వికము బలహీనత కాదు, దేవుని నియంత్రణలో ఉన్న బలం. గ్రీకు పర్యాయపదాలపై తన పుస్తకంలో ట్రెంచ్, సాత్వికము అనేది దయతో కూడుకున్నదని మరియు సాత్వికము యొక్క అవలంబన ప్రధానంగా దేవుని వైపు ఉందని చెప్పారు. మనతో దేవుని వ్యవహారాలన్నీ మంచివిగా అంగీకరించే వైఖరి ఇది.
అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.౹ 23-24ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. (గలతీ 5:22,23)
నియమము:
సాత్వికముకలిగిన వైఖరి మనతో దేవుని వ్యవహారాలన్నీ మంచిదని అంగీకరిస్తుంది.
అన్వయము:
సౌమ్యుడు తన జీవితంలో బలహీనుడు కానట్లు సాత్వీకము అనేది సున్నితత్వము కాదు. సాత్వీకుడు తన జీవితంలో దేవుని శక్తిని తెలిసిన శక్తివంతమైన వ్యక్తి. అతని గమనము ప్రభువు మీదనే కానీ తనమీద కాదు. ఇది నియంత్రణలో ఉన్న శక్తి, మన జీవితాలను నియంత్రించే దేవుని శక్తి.
సౌమ్యుడు వ్యక్తి ధిక్కార భావనతో ఇతరులను తక్కువగా చూడడు. అతను ఏమైఉన్నాడో అది దేవునివలననే అని అతను బాగా గ్రహించినవాడు. దేవుని కృప అతనిని సాత్వీకునిగా చేస్తుంది. తన వద్ద ఉన్నవన్నీ దేవుని చేతినుండే అనుగ్రహింపబడినదని అతనికి తెలుసు.
మీ ఎదుట నున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీయెడల ధైర్యముగలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. (2కొరిం 10:1)
సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను. (గలతీ 6:1)
కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.౹ (కొలస్సీ 3:12)
నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి; (1పేతురు 3:15)