Select Page
Read Introduction to James యాకోబు

 

మీలో జ్ఞాన వివేకములుగలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.

 

తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.

 “యోగ్య ప్రవర్తనవలన” మన జ్ఞానవివేకములను రుజువు చేస్తాము. “ప్రవర్తన” అనే పదానికి తలక్రిందులుగా త్రిప్పుట, వెనక్కి తిరగడం అని అర్ధం. జీవన విధానం, ప్రవర్తన అను భావన. రోజువారీ ప్రవర్తనపై దృష్టి కేంద్రీకరించబడుతుంది.

మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే

 “కనుపరచవలెను” అనే పదానికి ఒప్పులోలు యొక్క సాక్ష్యం లేదా రుజువును కళ్ళకు చూపించుట అని అర్ధము. అందువలన, వెలుగులోకి తీసుకురావడం, ప్రదర్శించడం, అనే భావన ఉంది. మన ప్రవర్తన మరియు బహిరంగ దినచర్యల ద్వారా మనకు ఉన్న వాటి యొక్క వాస్తవికత మరియు స్వభావాన్ని ప్రదర్శిస్తాము.

నియమము:

విశ్వాసి యొక్క ప్రవర్తనలో జ్ఞానం యొక్క వ్యక్తీకరణను మనము చూడవచ్చు.

అన్వయము:

మంచి ప్రవర్తన ద్వారా మన క్రియలను చూపిస్తాము. మన క్రియలకు మూలం మన మంచి ప్రవర్తన, మంచి జీవన విధానం. మనం చేసే పనుల ద్వారా ఆ జీవన విధానాన్ని వ్యక్తపరుస్తాము. ఆ జీవన విధానం దేవుని జ్ఞానం మరియు అవగాహన నుండి వస్తుంది. మన జీవన విధానము దేవుని నుండి భిన్నంగా ఉన్నదని ప్రజలు గమనిస్తారు.

Share