Select Page
Read Introduction to James యాకోబు

 

మీలో జ్ఞాన వివేకములుగలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.

 

ఈ వచనములో, యాకోబు జ్ఞానం మరియు వ్యక్తిగత ప్రవర్తన (3:13-18) మధ్య సంబంధాన్ని గురించి చెబుతున్నాడు. మన నాలుకను నియంత్రించాలంటే మనకు జ్ఞానం అవసరం. దైవిక జ్ఞానం సరైన పదాలను మరియు సరైన క్రిర్యలను ఉత్పత్తి చేస్తుంది.

మీలో జ్ఞాన వివేకములుగలవాడెవడు?

జ్ఞానం అనేది దేవుని దృక్కోణం నుండి విషయాలను చూడగల సామర్థ్యం. క్రొత్త నిబంధన అనుభవానికి నియమమును అన్వయించు నైపుణ్యమునకు “జ్ఞానము ” అను మాట ఉపయోగిస్తుంది. ఇది బైబిల్ గురించి వాస్తవాలను తెలుసుకోవడం కంటే ఎక్కువ కాని ఆ వాస్తవాలను సరిగ్గా ఉపయోగించడం. జ్ఞానం అనేది లేఖన సూత్రాలను అర్థం చేసుకోవడం ద్వారా దేవుడు ఇచ్చేది; అది స్వయం నుండి రాదు.

పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండినయెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు. (1కొరిం 2:6-8)

ఇది క్రొత్త నిబంధనలో “వివేకము” అను గ్రీకు పదాన్ని ఉపయోగించబడిన ఏకైక సంధార్భము. “వివేకము” ఉన్న వ్యక్తి  నైపుణ్యం కలిగిన, తెలివైన, అనుభవం కలిగిన వ్యక్తి. ఇది ప్రత్యేకమైన మానసిక అవగాహన లేదా దేవుని వాక్యాన్ని గ్రహించడం గూర్చి చెప్పడానికి ఉపయోగించు పదము. ఇది దైవఆధారిత జీవితాన్ని గడపడానికి తన అనుభవాన్ని వర్తింపజేయగల వ్యక్తిని గురించినది.

నియమము:

అనుభవానికి నియమాన్ని వర్తింపజేయగల వ్యక్తి జ్ఞాన వివేకములుగలవాడు.

అన్వయము:

నిజమైన జ్ఞానం మరియు వాక్యపరమైన వివేచన, మనకు తెలిసిన వాటికి విధేయత చూపుట నుండి కలుగుతుంది. ఇది సమాచారం సమకూర్చుకొనుట కాదు.

దేవుని జ్ఞానం మరియు మనుష్యుల జ్ఞానం మధ్య చాలా తేడా ఉంది. దేవుని జ్ఞానంతో నడుస్తున్న వారు మనుష్యుల జ్ఞానంతో నడిచేవారికి భిన్నంగా నడుస్తారు. దేవుని జ్ఞానం ఒక ఆధ్యాత్మిక జ్ఞానం. బైబిల్ జ్ఞానం విజ్ఞానాన్నీ కూడబెట్టుకోవడము కాదు, జ్ఞానాన్ని సరిగా  ఉపయోగించడము. ఈ రకమైన జ్ఞానం మన ప్రవర్తనలో కనిపిస్తుంది. మన జీవితంలో దైవిక ఉత్పత్తిని ఉత్పత్తి చేయడానికి దేవునిని ఎలా అనుమతించాలో జ్ఞానం చూపిస్తుంది కాబట్టి మనం చేసే పనిలో దానిని మనం చూడగలము.

పరిశుద్ధాత్మకు సమర్పించుకోవడము దైవిక జ్ఞానం ఉన్న వ్యక్తి యొక్క సూచన. నీతివంతమైన ప్రవర్తనలో నిజంగా నైపుణ్యం ఉన్నవారిపై దేవుడు ఆసక్తి కలిగి ఉంటాడు. మన జ్ఞానాన్ని మనకు ఎంత తెలుసు అనే దానితో కాక మనం ఎంత అన్వయించుకుంటున్నామో అనే దానితో  కొలవాలి.

కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము; ..మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. (ఆపో.కా 6:3,10)

Share