Select Page
Read Introduction to James యాకోబు

 

నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.

 

నాలుక ఏమి చేయగలదో దాని యొక్క దూర ప్రభావాలను యాకోబు ఇప్పుడు వివరించాడు.

నాలుక అగ్నియే,

నాలుక కోపమును పుట్టిస్తుంది, మరియు అది అగ్నివంటిది.

నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై

‘పాపము’ అనే పదానికి తప్పు, అన్యాయం, దుష్టత్వం అని అర్ధం. పాపము ఒక  అన్యాయమైన చర్యను వివరిస్తుంది. మనము హృదయ బావిలో ఉన్నదాన్ని మాటల బకెట్టుతో బయటకు తోడుతాము.

‘ప్రపంచం’ అను మాట, నాలుక ప్రతి విధమైన చెడును కలిగి ఉంటుంది అనే ఆలోచనను తెలియజేస్తుంది. ఇందులో అసూయ, ద్వేషము, కామం, కోపం, దుర్మార్గం లేదా దురాశ వంటి పాపపు వైఖరులను కలిగి ఉంటుంది. ఈ పాపాలన్నీ నాలుకలో తమ బయటి మార్గాన్ని  కనుగొంటాయి.

నియమము:

నాలుక విస్తృతంగా దెబ్బతీయగలదు

అన్వయము:

నాలుక మన వైఖరిలో విస్తృతంగా రగిలే అగ్ని. దుర్ణీతి మరియు అన్యాయం యొక్క విశ్వంలో చెడు నాలుక ఉంది. ఇది నాలుక ఉత్పత్తి చేసే విస్తృత అపరాధం గురించి చెబుతుంది. ఈ పాపం యొక్క అవకాశాలు అంతులేనివి.

వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది. వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. (రోమా 3:13,14)

Share