Select Page
Read Introduction to James యాకోబు

 

కాబట్టి – అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను

అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితు డని అతనికి పేరుకలిగెను.

 

మరియు దేవుని స్నేహితు డని అతనికి పేరుకలిగెను.

దేవుడు అబ్రాహామును “దేవుని స్నేహితుడు” అని పిలిచాడు, ఎందుకంటే అతను నమ్మిన దశాబ్దాల తరువాత, అతను ఇస్సాకును ఒక బలిపీఠం మీద అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విధేయత కారణంగా దేవుడు అబ్రాహామును ప్రత్యేక విధానములో ప్రేమించాడు. ఇస్సాకును అర్పించడానికి ఆయన అంగీకరించడం ద్వారా అబ్రాహాము నీతిమత్వము నిరూపించబడింది. విధేయత విశ్వాసానికి నిదర్శనం.

 “స్నేహితుడు” అనే పదానికి ప్రియమైన, సన్నిహితమైన అని అర్థం. ఒక స్నేహితుడు ఆత్మీయ ఆందోళనలను పంచుకునే వ్యక్తి. అదే విషయాలను పంచుకోని సహచరుల నుండి ఇది భిన్నంగా ఉంటుంది.

నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. (2దిన 20:7)

నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ,

నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,  (యెషయా 41:8)

విషయం ఏమిటంటే, దేవుడు తనను “స్నేహితుడు” అని పిలిచినప్పుడు అబ్రాహాము అప్పటికే విశ్వాసి అయ్యాడు. అబ్రాహాము తన విశ్వాసమును కార్యరూపములో పెట్టినప్పుడు దేవుడు అబ్రాహామును తన స్నేహితుడిగా ప్రకటించాడు. అబ్రాహాము లాభ నష్టాలు ఆలోచించుకోలేదు. మన విశ్వాసాన్ని అమలు చేసినప్పుడు దేవుడు మనలను స్నేహితులను లెక్కిస్తాడు. దేవుడు తన స్నేహానికి అర్హులుగా మనల్ని లెక్కించడు కాని తమను తాము సేవించుకోకుండా ఇతరులకు సేవచేసేవారిలో దేవుడు ఆనందిస్తాడు.

నియమము: 

విధేయత విశ్వాసానికి నిదర్శనం.

అన్వయము:

యేసు మనకు ఆజ్ఞాపించినదంతా చేస్తే మనం ఆయన స్నేహితులు అని చెప్పారు. దేవునితో నడిచే వ్యక్తి దేవునికి స్నేహితుడు. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం.

దేవునికి స్నేహితుడిగా ఉండడం ఒక విషయం కాని దేవుడు మనకు స్నేహితుడిగా ఉండటం మరొక విషయం. దేవుడు నిన్ను తన స్నేహితుడిగా భావిస్తున్నాడా? దేవుడు మనతో స్నేహం చేస్తాడనేది ఊహాతీతము.

నేను మీ కాజ్ఞాపించువాటినిచేసినయెడల, మీరు నా స్నేహితులైయుందురు.౹ 15దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని. (యోహాను 15:14)

నిజమైన స్నేహితులు ఒకరినొకరు సొంతోషపరుచుకుంటారు, విశ్వసిస్తారు. యేసు తన తండ్రిని సంతోషపెట్టాడు మరియు అతనిని ఎప్పుడూ నిరాశపరచలేదు.

నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. (యోహాను 8:29)

Share