Select Page
Read Introduction to James యాకోబు

 

అయితే ఒకడు –నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి; క్రియలులేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును.

 

యాకోబు ఇప్పుడు 18-20 వచనాలలో నిజమైన విశ్వాసమునకు రుజువులను గూర్చి వ్రాస్తున్నాడు. ఇది మరింత స్పష్టంగా 2: 14,16లో ఉన్నది. మనము ఆర్ధికంగా పేదలైనవారితో, “ముందుకు సాగండి, మీకు మీరే సహాయం చేస్కోండి” అని చెప్పి మరియు అదే సమయంలో చైతన్యవంతమైన విశ్వాసాన్ని కొనసాగించలేము.

అయితే ఒకడు

మూడవ సారి యాకోబు ఒకరు ఏదో ఉన్నట్లుగా చెప్పి దానికి విరుద్ధంగా చేసే పరిస్థితిని ఉపయోగిస్తున్నాడు. “ఒకరు నమ్మేదానికంటే అతను ఎలా ప్రవర్తిస్తాడు అనేది చాలా ముఖ్యం” అని ఎవరైనా చెప్పినప్పుడు, ఇది విశ్వాసం యొక్క సూత్రాన్ని బలహీనం చేస్తుంది. నిజమైన క్రైస్తవుని మాటలు ఎల్లప్పుడూ నిజమైన క్రైస్తవ నడకకు అనుగుణంగా ఉంటుంది.

నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి

క్రియలు  లేని విశ్వాసం మృతము అను  తన ప్రతిపాదనకు యాకోబు  మరొక అభ్యంతరాన్ని పరిచయం చేశాడు.

క్రియలులేకుండ నీ విశ్వాసము నాకు కనుపరచుము

క్రియలు లేకుండా ఒకరి విశ్వాసం యొక్క గతిశీలతను నిరూపించడం కష్టం. “కనుపరచుము” అనే పదానికి అర్ధం ప్రదర్శించు, చూపించు అని అర్ధము. వారు చేసే పనుల ద్వారా తప్ప ఎవరైనా తమ విశ్వాసాన్ని ఎలా ప్రదర్శిస్తారు? మనము క్రియల ద్వారా విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాము, రుజువు చేస్తాము మరియు కనుపరుస్తాము. దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు (రోమా 8:33) క్రీస్తు నందు యోగ్యలమయ్యాము (రోమా 3: 21-25) ఆయన మధ్యవర్తిత్వం వహించి సంపూర్తి చేసిన కార్యమునందు విశ్వాసం ద్వారా (రోమా 5: 1) మరియు క్రియల ద్వారా ధృవీకరించబడింది. మన క్రియలు మనలను నీతిమంతులుగా తీర్చలేదు గాని, మన క్రియలు మనము నీతిమంతులుగా చేయబడ్డాము అనుటకు నిదర్శనం. మొక్క పువ్వులను ఉత్పత్తి చేస్తుంది కాని పువ్వుల ముందు మొక్క ఉండేది.

నేను నా క్రియలచేత నా విశ్వాసము నీకు కనుపరతునని చెప్పును

విశ్వాసం క్రియలను ఉత్పత్తి చేస్తుందని చూపించడం యాకోబు వ్రాస్తున్నాడు. సాధారణ వ్యాయామం కంటే విశ్వాసం ఎక్కువ. ఇది దేవుని వాగ్దానాలు మరియు ఏర్పాటులలో ఆనుకోవడము 

క్రియలు లేకుండా క్రియాశీల విశ్వాసం ఉనికిలో ఉండదు కాని విశ్వాసం క్రియాలకు ఆధారం. అయితే, క్రియలు నిజమైన విశ్వాసానికి అవసరమైన సంకేతం. ఒక వ్యక్తి తన జీవితం నుండి వచ్చే దాని ద్వారా నిజమైన విశ్వాసం కలిగిఉన్నాడని మనకు తెలుస్తుంది. ఏదేమైనా, క్రైస్తవులందరూ మంచి పనులను నిర్వహించరు కాబట్టి మంచి పనులను కొనసాగించమని తీతు వారిని సవాలు చేస్తున్నాడు.

ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతు లనుగూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై యున్నవి గాని (తీతు 3:8)

క్రైస్తవుడు తన క్రైస్తవ నడకను కొనసాగించాలి (గలతీ 5: 16-17) మరియు అతని ఇష్టానుసారం నింపబడవచ్చు లేదా నింపబడకపోవచ్చు (ఎఫెస్సీ 5:18). దైవిక ఉత్పత్తి క్రైస్తవునికి స్వయంచాలక విషయము కాదు, అందుకే యేసు తన శిష్యులు ఏమి చేయాలో దానిని చేయమని ఆజ్ఞాపించాడు (యోహాను 13:17).

నియమము:

దేనినీ ఉత్పత్తి చేయకుండా మనం క్రియాశీలక విశ్వాసాన్ని ఉంచలేము.

అన్వయము:

జాన్ కాల్విన్ తరువాత సంస్కరించబడిన ప్రబోధకులు ఒక వ్యక్తి నీతిమంతునిగా తేర్చబడిన నిశ్చయత కు మునుపు పరిశుద్దపరచబటకు రుజువులు ఉండాలన్న ఆలోచనను  ప్రాచుర్యం చేశారు. జాన్ కాల్విన్ ఈ అభిప్రాయాన్ని ఎప్పుడూ కలిగి లేడు కాని అతని బోధనల నుండి నిష్క్రమణపొందినది.

మన నిరీక్షణ దేవుని వాక్యం నుండి వచ్చింది కానీ, మంచి పనుల నుండి కాదు. లేఖనాల “సాక్ష్యం” ద్వారా మనకు తెలుసు:

ఆ సాక్ష్యమేమనగా–దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారునియందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను (1యోహాను 5:11-13)

మనము రక్షింపబడ్డామని దేవుని వాగ్దానములను బట్టి మనము ఎరుగుదుము:

నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (యోహాను 5:24)

మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. (యోహాను 20:30,31)

ద్రాక్షవల్లి యొక్క కొన్ని కొమ్మలు ఫలించవు (యోహాను 15: 2, 6) అయినప్పటికీ అవి ద్రాక్షావల్లిలో భాగం. శరీరసంబంధ క్రైస్తవులు శరీరమును సంతోషపరుస్తారు.

Share