Select Page
Read Introduction to James యాకోబు

 

కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయ పడును.

 

కనికరము తీర్పును మించి అతిశయ పడును.

తీర్పు కంటే దయకు గొప్ప శక్తి ఉంది. మనము వివక్ష లేని వ్యక్తులుగా జీవిస్తున్నట్లయితే మరియు ఇతరులకు దయ చూపువారమైతే, క్రీస్తు న్యాయపీఠము యెదుట యేసు చేత మూల్యాంకనం చేయబడుటకు మనము సిద్ధంగా ఉన్నాము. ఆ రోజున దేవుడు మనకు కనికరమును చూపిస్తాడు. కనికరము చూపే వ్యక్తి తీర్పుపై విజయం సాధిస్తాడు ఎందుకంటే దేవుడు అతనిపై తీర్పు ఇవ్వడు.

కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు. (మత్తయి 5:7)

నియమము:

మనం ఇక్కడ ఇతరులకు చూపించే కనికరము ఇకమీదట మనకు బయలుపడుతుంది.

అన్వయము:

క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనం కనికరమును ఆశించినట్లయితే, మనం మన సమయములో  కనికరమును చూపాలి. ఆ రోజున దేవుడు మనలను ఎలా అంచనా వేస్తాడో మన కనికరముగల మనసు నిర్ణయిస్తుంది. తోటి విశ్వాసులకు మనం కనికరము చూపిస్తే, ఆ రోజున యేసు మనలను ఎలా అంచనా వేస్తాడనే దానిపై మాకు ఎటువంటి ఆందోళన అవసరము లేదు. ఇది కనికరమువలన కలుగు యోగ్యత.

మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. (మత్తయి 6:14,15)

ప్రభువు మనకు నిత్యత్వములో చూపు కనికరము కోసం ఎదురుచూస్తున్నాము. అంతిమముగా  కనికరము తీర్పును మించి అతిశయ పడును. ఆయన మన పట్ల చూపు కనికరము మన పనుల వల్ల కాదు, సిలువపై ఆయన చేసిన కార్యము వల్ల. నిత్యజీవము కొరకు సిలువను స్వీకరించినప్పుడు మనకు లభించే కనికరమునకు మనము అర్హులము కాము.

ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలొ నిలుచునట్లు కాచుకొని యుండుడి.౹  (యూదా 1:20,21)

Share