Select Page
Read Introduction to James యాకోబు

 

ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పిపోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును

 

గైకొనియు

పక్షపాతము చూపుట అను పాపము చేయుటవలన మన అపరాధ భావమును గూర్చి యాకోబు అభివర్ణిస్తున్నాడు. (2:9)   

ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు

“ఎవరైతే” అనే పదం కింది సూత్రానికి మినహాయింపు లేదని సూచిస్తుంది – ఏ మరియు ప్రతి వ్యక్తి దోషి. ఇది సార్వత్రిక సూత్రం. ఇది ఎక్కడైనా ఎవరికైనా వర్తిస్తుంది.

ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పిపోయినయెడల ఆ వ్యక్తి ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. “ధర్మశాస్త్ర మంతయు గైకొను” ఏకైక వ్యక్తి యేసు. యాకోబు ధర్మశాస్త్ర మంతయు గైకొనే సూత్రాన్ని ఉదాహరణగా ఉపయోగిస్తున్నాడు.

నియమము:

ధర్మశాస్త్రము దేవుని సంపూర్ణ గుణాలక్షణాల వ్యక్తీకరణ.

అన్వయము: 

ధర్మశాస్త్రాన్ని గైకొనుటద్వారా ఎవరూ క్రైస్తవులుగా మారలేరు. అది సాధ్యమైతే, మన పాపములకు క్రీస్తు మరణించవలసిన అవసరం ఉండేది కాదు.

మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచియున్నాము; ధర్మశాస్త్రసంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు. నేను పడగొట్టినవాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విష యమై చచ్చినవాడనైతిని. నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్‌ప్రయోజనమే. (గలతీ 2:16-21)

రక్షణ కొరకు లేదా పవిత్రీకరణ కోసం ధర్మశాస్తాన్ని గైకొనుటకు ప్రయత్నిస్తే, మనకు మనము ఒక శాపాము క్రిందకు పెట్టుకుంటున్నాము. క్రీస్తు శిలువ బలియాగము పై మన విశ్వాసము ఉంచినట్లయితే, దేవుడు ఆయనను శాపగ్రాహిగా చేశాడనే వాస్తవాన్ని మనము అంగీకరిస్తాము. యేసు ధర్మశాస్త్రం యొక్క ప్రతి ఆజ్ఞను నెరవేర్చాడు, అయినప్పటికీ మన ఆత్మలను రక్షించుటకు దేవుడు ఆయనను శాపగ్రాహిగా చేశాడు.

ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా–ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా– నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును. ఆత్మనుగూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమో చించెను; ఇందునుగూర్చి– మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. (గలతీ 3:10-14)

Share