Select Page
Read Introduction to James యాకోబు

 

మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.

 

మీరు పక్షపాతము గలవారైతే

పక్షపాతం అంటే కొందరికంటే ఇతరులపై గౌరవం చూపడం – వివక్ష చూపడం, అభిమానవాదం చూపించడం, పాక్షికంగా ఉండటం. యాకోబు దీనిగురించి  ఒకటవ వచనంలో ప్రారంభించాడు – ప్రజలను అంతర్గత ప్రమాణాలు కాకుండా, బయటి నుండి అంచనా వేయడం

గ్రీకు భాషలో ఇక్కడ వాడిన  “అయితే” అంటే “గనుక” అని. యాకోబు పాఠకులు అప్పటికే పక్షపాతమనే పాపము జరిగించిన వారై ఉన్నారు.

దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను.  (అపో.కా. 10:34)

ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి

“తీర్చబడి” అనే పదానికి నిరాకరించడం, మందలించడం అని అర్ధం. ధర్మశాస్త్రము మన వివక్షను వెలుగులోకి తెస్తుంది మరియు బహిర్గతం చేస్తుంది. ధర్మశాస్త్రము మన న్యాయమూర్తి అవుతుంది. దేవుని వాక్యం ఇతరులపై వివక్ష చూపేవారిని పరీక్షిస్తుంది మరియు వారిని దోషులుగా కనుగొంటుంది.

అపరాధులని తీర్చబడి

ఈ వచనములో  పాపానికి రెండవ పదం “అపరాధులు”. అపరాధి అను పదము పాపి కంటే భిన్నంగా ఉంటుంది. అపరాధి అనే పదం పక్కన మరియు అడుగు వేయు అను  రెండు పదాల నుండి వచ్చింది. సూచించిన ప్రమాణమును దాటుట అను భావనకలిగి ఉంది. అపరాధి ఉద్దేశపూర్వక పాపి. అతను ఒక రేఖను స్పష్టంగా చూస్తాడు మరియు దానిపై ఉద్దేశపూర్వకంగా దాటి వెళ్తాడు. మన పొరుగువారిని ప్రేమించాలనే రేఖను దాటుకుంటాము (2 8). అది రాజాజ్ఞ.

పాపము చేయువారగుదురు.

ఈ వచనములో యాకోబు పాపమునకు రెండు పదాలను ఉపయోగించాడు 1) పాపము , మరియు 2) అపరాధులు. పాపాము అనే పదానికి గురి తప్పుట అని అర్థం. బైబిల్ పరంగా గురి దేవుని నీతికి సంబంధించినది. మనపట్ల  దేవుని లక్ష్యం ఆయన ఏమై ఉన్నడో, తగినవిధముగా స్థిరంగా జీవించుట. మేము దేవుని గుణముల యొక్క ప్రమాణాల ప్రకారం జీవించినప్పుడు దేవునిని గొప్పగా మహిమపరుస్తాము. నకిలీ బాహ్య ప్రమాణాల కారణంగా దేవుని గుణము ప్రజలపై వివక్ష చూపదు.

“చేయువారగుదురు” అనే పదానికి పని, జరిగించుట అని అర్ధం. మనం ఇతరులపై వివక్ష చూపినప్పుడు, మనము పాపము చేస్తాము. ఇది నిరంతర కృషి ఆధారంగా అభిమానవాదం యొక్క ప్రదర్శన.

నియమము:

ఇతరులపై వివక్ష చూపే వారితో దేవుడు సహవాసం చేయడు.

అన్వయము:

ఒక వ్యక్తి పేదవాడు లేదా చదువురానివారు లేదా కొంత శారీరక వైకల్యం ఉన్నందున మేము వివక్ష చూపిస్తే, మేము ప్రేమను గూర్చిన  రాజాజ్ఞను ఉల్లంఘిస్తున్నాము. మనము దేవుని ప్రమాణాలకు వెలుపల అడుగు పెట్టిన వారమౌతాము.

రహదారి ప్రక్కన గాయపడిన వ్యక్తికి సహాయం చేసింది సంరేయుడు, భక్తికలిగిన లేవీయుడు కాదు, సమారిటన్ జాతి (లూకా 10:29-37). నిజమైన ప్రేమ ప్రేమించేవారిని ప్రత్యేకంగా ప్రేమించదు. నిజమైన ప్రేమ ప్రజల మధ్య తేడాలు చూడదు. రాజాజ్ఞ వివక్షను తప్పుగా రుజువు చేస్తుంది మరియు క్రైస్తవ విశ్వాసముకు  సరితూగనిదానిగా చూపుతుంది.

మనలో ఎవరూ అపరాధ భావనను ఇష్టపడరు. అయినప్పటికీ, దేవుడు తన సత్యము, నీతిని మన భావాలకొరకు పనముగా పెట్టడు. మేము వివక్షకు పాల్పడినంత కాలం దేవుడు మనతో సహవాసం చేయడు. దోషనిర్ధారణ దిద్దుబాటు యొక్క ప్రారంభం. మేము ఆ పాపము చేసినవరమని తెల్సుకున్నప్పుడు, మన పాపాన్ని అంగీకరిస్తే, మేము కోలుకునే మార్గంలో ఉన్నాము.

Share