నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?
విశ్వాసమందు భాగ్యవంతులుగా
విశ్వాసమందు భాగ్యవంతులపై వివక్ష చూపితే స్వీయ విశ్వాస విలువపై వివక్ష చూపినట్లే. బీదలైనవారు ఆర్ధికపరముగా మాత్రమే పేదవారు. నిత్య సంపద విషయములో వారు వాస్తవముగా భాగ్యవంతులు. వాస్తవిక విలువపై యాకోబు పత్రిక పాఠకులు తప్పుగా అంచనా వేశారు. దేవుని సహాయము కొరకు చూచువారిని చిన్న చూపు చూశారు.
భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.(మత్తయి 6:19-21)
నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నే నెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడ కుము. (ప్రకటన 2:9)
తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా
“వారసుడు” అనగా స్వాస్త్యము లేక భాగము. యేసు విశ్వాసికొరకు నిత్య స్వాస్త్యము లేక భాగమును సంపాదించాడు. తన పాపముల క్షమాపణ కొరకు క్రీస్తు రక్తము నందు విశ్వాసముంచుట వలన నిత్యజీవమనే భాగ్యమును క్రైస్తవుడు కలిగి ఉన్నాడు. క్రీస్తుతో మన సహవాసము వలన దేవుని రాజ్య వారసులమయ్యము. క్రీస్తు రాజ్యము మన రాజ్యము. దేవుడు శాశ్వతమైన వాటివిషయంములో మనలను భాగ్యవంతులుగా చేశాడు.
దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము. (2కొరిం 6:10)
నియమము:
యే భేదము లేకుండా ప్రతీ క్రైస్తవుడు దేవుని నివాసమునకు వారసుడు.
అన్వయము:
దేవుడు లేకుండా ఈ లోకమును విడిచినప్పుడు, మనము కలిగి ఉండునది శూన్యమే. దేవునితో మనము ఈ లోకమును విడిచినప్పుడు నిత్య రాజ్యమును మనము స్వతంత్రించుకుంటాము. ప్రతీ మానవుడు ఏదో ఒక సంపదకు వారసుడు కావాలనుకుంటాడు, అయినను ప్రతీ క్రైస్తవుడు దేవుని రాజ్యమునకు వారసుడు అగును.
మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతోకూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసు లము; క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము. (రోమా 8:16,17)
మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతోకూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది (1పేతురు 1:3-5)
దేవుని ఎరుగని వారికంటే క్రైస్తవుడు లెక్కింపజాలని అధిక సంపద కలిగిఉన్నాడు. ఇందులో గొప్ప ఆధీక్యత ఉన్నది.
మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను. (2కొరిం 8:9)
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు; ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృిష్టి యుంచెను. (హెబ్రి 11:24)