మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా?
మీ మనస్సులలో భేదములు పెట్టుకొని
బేధాములు పెట్టుకొనుట అనగా ఒకరినుండి అంతటా లేక పూర్తిగా వేరగుట. వారిగురించి మనము బేధాభిప్రాయము కలిగిఉన్నకారణమున ఒకరినుండి మనకు మనము వేరుచేసుకుంటాము. మనకు ఉన్న కొన్ని ఊహాత్మక లక్షణములు ఉన్న కారణాన వారికంటే ఘనులుగా మనలను భావించుకుంటాము.
ఒకరికి పైగా మరొకరికి పక్షపాతముచూపినప్పుడు మనము మన చుట్టూ ఉన్నవారికి గంబీరమైన సంకేతాన్ని ఇస్తున్నాము.
మీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా
“ఆలోచన” అనగా లోపలి తర్కము, ఒక అభిప్రాయము. ఇది సమీక్షణము కొరకు తనకు తానుగా ఒక వ్యక్తి తర్కించుకొను సంప్రదించు విధానము. ధనికులు దారిద్రుల వ్యత్యాసాలు చేయునది దుష్టకరమైన ఆలోచన విధానము.
నియమము:
పక్షపాతము చూపుట దేవుని చిత్తము కాదు.
అన్వయము:
ధనికులకు పక్షపాతము చూపినప్పుడు లోకము పై మన ధృక్పధమును తెలుపుచున్నాము. అక్షయమైన విలువలకన్నా భౌతికవాదాన్ని నమ్ముతున్నాము. ఒకరి ప్రాధాన్యతలకన్నా మరొకరివి పైన ఉంచినప్పుడు, మనము దురాలోచనతో విమర్శచేసినవారమవుతాము. ఒక వర్గానికి ఒక నియమము మరొకవర్గానికి మరో నియమము ఉంచడము లాంటిది.
ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ జేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల? (1కొరిం 4:7)
మనలో అనేకులు ఈ ఆలోచనలు మన స్నేహితులు, తోటి పనివారు తెలుసుకొననివ్వము. ఈ ఆలోచనలు మన మదిలోకి వస్తే, వెంటనే ఒప్పుకోలుతో వాటితో వ్యవహరించాలి లేకపోతే అవి మన మనసులను కప్పి ధృక్పధములుగా వృద్దిచెందుతాయి.