Select Page
Read Introduction to James యాకోబు

 

మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి–నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో–నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల

 

మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించి–నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి

ఒక ధనవంతుని గౌరవప్రధమైన స్తానమునకు ఒక సంఘము ఆహ్వానించినట్లుగా ఈ వచనములో యాకోబు ఒక ఊహాత్మక ఉదాహరణను ఇస్తున్నాడు. ధనవంతుని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, పేదవాని ఖచ్చితమైన శ్రద్ధ చూపుటలేదు.   

 “చూచి” అనుమాట గ్రీకుభాషలోని ‘మీద’ మరియు ‘చూచు’ అను రెండు పదాల కలయిక. ధనవంతుడు సంఘమునకు వచ్చినప్పుడు, అతనిపై ప్రత్యేక శ్రద్ధనిలిపారు, అతనిపై చూపునుంచారు.  అసూయతో మరియు వినయముతో అతనిని చూచారు.

ఆ దరిద్రునితో–నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల

పేదవాడైన రెండవవ్యక్తి మందిరములో ప్రవేశించాడు. తాను ఎక్కడ కూర్చుండాలో సూచనలు తప్ప, అతని పట్ల ప్రత్యేక “శ్రద్ధ” నిలిపినట్లుగా ఉదహరింపబడలేదు. 

ఈ మాటలు కఠోరమైన పక్షపాతమునకు సూచన. ఒక సంఘము ఒక పేదవానిని ఒక ధనవంతునికన్న ఎక్కువగా లేక తక్కువగా ఘనపరచలేదు లేదా తృణీకరించలేదు. 

నియమము:

భౌతికపరమైన ధనముబట్టి  మనుషులను పరిగణించుట విలువలను అణచివేయడమే.

అన్వయము:

తమ సంపదనుబట్టి ప్రజలను మనము వ్యవహరించునప్పుడు  మన విలువలను మీరుచున్నాము.  ఆశాశ్వతమైన విలువలకన్నా శాశ్వతమైన విలువలు ప్రాముఖ్యమైనవి.

వారు కలిగిఉన్న దానిని బట్టి అసూయకలిగి, ధనవంతులైన వారి పట్ల వినయము చూపుతున్నప్పుడు, మన వాస్తవ వాస్తవ విలువలను చూపుతున్నాము.  వారిపై అసూయకలిగి ఉంటాము కనుక ధనవంతులను గౌరవిస్తాము. 

మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.౹ 28మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె–మన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. (ఆపో.కా 17:26-29)

Share