తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా–దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే
పవిత్రమును
ముందు వచనములో ఉన్న పైభక్తికి బదులుగా యాకోబు ఇప్పుడు పవిత్రమైన నిష్కళంకమైన నిజక్రైస్తవ్యాన్ని చూపించుచున్నడు.
“పవిత్రమైనది” అనగా మలినమైఉండి ఇప్పుడు కడుగబడినది. దేవుని ఆమోదము సంపాదించుకొన వెదకు భక్తి మలినమైన భక్తి. ఈ చెడుమిశ్రమము నుండి “”పవిత్రుడు” స్వతంత్రుడు.
నిష్కళంకమునైన భక్తి
“నిష్కళంకమునైన” స్వార్ధముతో మంచిని చేయు కార్యములతో ఉన్న భక్తి అను భావన. మంచిని చేయు భక్తి, తనక్ స్వప్రయోజనము కొరకే. నిష్కళంకమైన భక్తి మలినము లేనిది.
స్వార్ధము వలన చెడిపోవుట నుండి వేరైనది.
“పరామర్శించుట” అనగా పైవిచారణ చేయుట, చూచుకొనుట. మూలభాషలో రెండుపదాల కలయిక : మీద, చూచుట. అనాధాలను, విధవరాండ్రను వారో ఇబ్బంధిలో పైవిచారణ చేయుట,”వారికొరకు భాద్యత తీసుకొనుము”
బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. (కీర్తనలు 41:1).
తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేనివారి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు (కీర్తనలు 68:5).
ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే
“మాలిన్యము అంటకుండా” అనగా మరకలేకుండా. లోకములోని దూషణ, నిందనుండి క్రైస్తవుడు వేరుగాఉండాలి. తన సాక్షాము ఎన్నడూ దెబ్బ తినకూడదు. రాజీపద్దుటకు దూరముగా ఉంటాడు. పాపరాహితమైన సంప్పోర్నట్ కాదుగానీ. చుట్టూయున్న వారి నిందలనుండి వేరుపడుట అను భావన.
నియమము:
సమస్యలో ఉన్నవారితో వ్యవహరించు విధానమువలన నిజ బైబిలు అనుచరులను కనుగొనవచ్చు.
అన్వయము:
అనేకులు దేవుని వద్దనుండి కాక మనుషులనుండి మెప్పును కోరి భక్తి చేస్తారు. దేవుడు మన సేవ అంతిమ లక్ష్యం, మనిషి కాదు.
క్రీస్తువారి మహిమా యొక్క ప్రబావము క్రైస్తవులమీద వారు యధార్ధముగా జీవించుట. మనముచేయునదంతా పవిత్రమైనదిగా, నిష్కళంకమైనదిగా, నింద నుంచి వేరగునట్లుగా ఉండాలి.