ఎవ డైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనినయెడల వాని భక్తి వ్యర్థమే.
తన హృదయమును మోసపరచుకొనుచు
తన స్వంత నోటిఫై అదుపు లేని వ్యక్తి తన స్వంత హృదయాన్ని మోసపర్చుకుంటున్నాడు. తనను తాను తప్పుదారి పట్టించుకుంటున్నాడు. తనాగురించిన వాస్తవాన్ని తాను చూచుకొనలేడు.
హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? (యిర్మియా 17:9)
వాని భక్తి వ్యర్థమే
“వ్యర్ధమే” అనుమాట పనికిరానిది అను పదము. ఈ వ్యక్తి యొక్క భక్తి ఫలితము, బలము శూన్యమే. తన భక్తి పనికిమాలినది, ఏ ఉద్దేశము లేనిది. అది వట్టిది, ఖాళీది, నిష్ఫలమైనది, పనికిరానిది, శక్తిలేనిది, సత్యహీనమినది. వ్యర్ధమిన భక్తి కలిగి ఉన్నాడు.
నియమము:
మనము విశ్వసించునది, అనుభవములోనికి మార్చుకొనకపోతే, మన క్రైస్తవ్యము పనికిరానిది.
అన్వయము:
చాలామంది మైలు దూరమంత వాక్యాని చెప్పగలరు కానీ ఇంచ్ దూరమంత మాత్రమే దాని ప్రకారము జీవిస్తారు. మాటలలో చాలా ఎక్కువగా ఉంటారు కానీ సత్యము విషయములో చాలా తక్కువగా ఉంటారు. వారు ప్రసంగాలను రుచి చూచువారు, వాటిని వాస్తవికతను అనీభవించని, ఆత్మీయవిషయాలలో అనుభవజ్ఞులు
నిజమైన ఆత్మీయ మనసుగల వ్యక్తి దేవుని వాక్యమును ప్రేమిస్తాడు. దేవుని వాక్యమును ప్రేమించినపుడు మనము దేవుని కుమారునిని కూడా ప్రేమిస్తాము.
బైబిలు కంటే మనము గొప్పవారు కాలేము. మన జీవితములోనికి బైబిలుని స్థిరముగా, నిత్యముగా ప్రసరణ చేయబడాలి. బైబిలు అత్యంత తీవ్రమైగా విమర్శించునది. మనము జీవించు జీవితవిధానమునకు మట్టపు గుండు, కొలత కర్ర.
దేవుని వాకాన్ని భుజిస్తే అది మనలో అంతర్భాగమౌతుంది. మనము ఏది తింటామో భౌతికముగా అదే మనము; మనం ఆత్మీయముగా ఏది నమ్ముతామో అదే మనము.