Select Page
Read Introduction to James యాకోబు

 

ఎవ డైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనినయెడల వాని భక్తి వ్యర్థమే.

 

మొదటిసారి చూచినప్పుడు ఈ వచనము సంధార్భోచితముగా కనిపించదు కానీ పైనున్న వచనాలకు చాలా దగ్గరగా సంబంధంకలిగి ఉన్నది. స్థిరమైన క్రైస్తవ జీవితము ఎల్లప్పుడు కార్యరూపకముగా ఉంటుంది. సత్యాన్ని అనుభవానికి అన్వయించుటకు యాకోబు ఒక ఖచ్చితమైన ఉదాహరణను ఇస్తున్నాడు. రెండు విషయాలలో దీనిని చూడవచ్చు :

మొదటిగా, నిజక్రైస్తవుడు తన నోటిని అదుపులో ఉంచుకుంటాడు (26 వ.) మరియు రెండవడిగా, అవసరతలో ఉన్నవారిని చేరుకుంటుంది. (27 వ.)   

ఎవడైనను… భక్తిగలవాడనని అనుకొనినయెడల

 “భక్తిగలవాడు” అనగా బాహ్యసంబంధమైన సేవను దేవునికి చేయుటకు జాగ్రతపడువాడు. ఇక్కడ భక్తిగల వాడు అనగా భక్తిభావము గలవాడు, దేవునిపట్ల అంకితభావమూగల వాడు  లేక దేవుని ఆరాధించువాడు.

నోటికి కళ్లెము పెట్టుకొనక

 “కళ్లెము” అనగా స్వాధీనములో ఉండుట. మనము గుర్రాన్ని కళ్లెముతో అదుపులో ఉంచుటము. ఇక్కడ అది నోటిని అదుపులో ఉంచుట. తన నోటిని అదుపులో యుంచుకొనని వాడు తన హృదయాన్ని మోసగించుకుంటాడు. తన నోటిని ఏలువాడు అనగా తాను ప్రకటించుదానిని ఆచరించువాడు.

ఇతరులను దాడిచేయుటకు నోటిని వినియోగించువాడు భక్తికలిగి ఆత్మీయతలేనివారికి స్పష్టమైన గురుతు. అలా ఎందుకంటే సత్యాన్ని  అనుభవానికి అతను అన్వయించాడు గనుక.

నియమము

అనుభవానికి సత్యాన్ని అన్వయించుటలో ఒక మార్గము నోటిని అదుపులో ఉంచుకొనుట.

అన్వయము:

ఎడతెగకుండా తిట్టుచు, ఇతరులతో కలహించుచు ఉండు ఆత్మీయత లేని వారు, అనుభవానికి సత్యాన్ని అన్వయించుట అను నియమము ప్రకారము పనిచేయరు. ఇతరులతో దురుసుగా మాట్లాడువారు, ఇతరులలో తప్పులను కనిపెట్టువారు, కించపరిచి మాట్లాడేవారు, తమ హృదయాలను మోసపుచ్చుకొనుచు , వ్యర్ధమైన అలవాటులో నిమగ్నమైఉన్నారు.

మనలను మనము  గొప్పవారిగా కనపరచుకొనుటకు ఇతరులను తృణీకరించినప్పుడు వ్యర్ధమైన భక్తిలో మనమున్నాము.

నా నాలుకతో పాపముచేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును

భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని ” (కీర్తనలు  39:1).

యెహోవా, నా నోటికి కావలియుంచుము; నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. (కీర్తనలు 141:3).

నేను మీతో చెప్పునదేమనగా –మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. (మత్తయి 12:36).

Share