Select Page
Read Introduction to James యాకోబు

 

అయితే స్వాతంత్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.

 

నిలుకడగా ఉండువాడెవడో

“నిలుకడగా ఉండువాడెవడో” అనగా ప్రక్కనే ఉండుట, దగ్గర  కొనసాగుట, ప్రక్కన లేక దగ్గర నిలచుట, ఒకఋ ప్రక్కన నిలుచుట. ఆత్మీయ జీవితనికి వనరుగా బైబిలును నిలకడగా చూచుట అను భావన.

వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి

దేవుని వాక్యము విషయములో, మనము వినుదానిని విడువకూడదు (!:23,24). “వాక్యానుసారుడు” వాక్యముతో తనను పరీక్షించుమని దేవునిని అడుగును. బైబిలుగురించి గొప్ప జ్ఞానము కలిగిఉండుట ఒకవిషయమైతే, దానిని విస్తృతంగా అనుభవానికి అన్వయించుట మరో విషయము.

దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము; నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము

నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము; నిత్యమార్గమున నన్ను నడిపింపుము. (కీర్తనలు 139:23-24).

ధన్యుడగును.

ఇక్కడ ధన్యుడగును అనుమాట సంతోషము గలవాడు అని కాదు. పరిస్తితులకు సంబంధము లేకుండా ఆత్మలో వర్ధిల్లుట.

దుష్టుల ఆలోచనచొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.  (కీర్తనలు 1:1-2).

తన క్రియలో

మన అనుభవానికి దేవుని వాక్యపూ నియమాలను అన్వయించుట మన ఆత్మకు ఆశీర్వాదము ఎందుకనగా అది మన జీవితమునకు దేవుని ప్రణాలికకు సరాసరిగా ఉన్నది.

నియమము:

తన అనుభవాలకు విస్తృతముగా వాక్యమును అన్వయించు క్రైస్తవుని ఆత్త్మీయముగా వర్ధిల్లును.

అన్వయము:

జీవిత విధానములో దేవుని వాక్యముప్రకారము జీవించువాడు, దేవుని వాక్యములో కొనసాగువాడు. అవకాశము ఉన్నప్పుడూ మాత్రమే కాదు, లేనప్పుడు కూడా వాక్యమును అనుసరించదానికి ప్రయత్నిస్తాడు. తను ఎదుర్కొను ప్రతి సంధర్భములో దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తాడు.

వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. (అపో. కా. 2:42)

దేవుని వాక్యానియమాల్ని మన అనుభవాలకు విస్తృతముగా అన్వయించుటవలన, అనుదినము దేవునితో మన నడకపై గొప్ప ప్రభావము కలిగి, ఆత్మీయ్ఙ్గా వర్ధిల్లుటకు కారణమౌతుంది.

Share