వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా
తానెట్టివాడో
“ఎట్టివాడో”అనుమాట అనగా రకము లేక నాణ్యత. ఈ మనుషుడు అడ్డములో చూచుకోని తన ప్రవర్తనలో లోపమున్నట్లుగా స్పష్టముగా తెలుసుకొన్నాడు గాని వాక్యమును నిర్లక్ష్యము చేసి వెళ్ళిపోయేను. తన ప్రవర్తనలో ఎటువంటి మార్పుతెచ్చుటకు వాక్యమునకు వీలు కల్పించడు. తన జీవితముపై దేవుని ప్రణాలికకు విరుద్దముగా, తాను అబిమానించి గట్టిగా పట్టుకొను కొన్నివిలువలకు భంగం కలుగుతుంది కనుక తన ప్రవర్తన మార్చుకోడానికి ఇష్టపడడు.
నియమము:
చూపుకు అతీతముగా క్రైస్తవుని జీవితములో ప్రవర్తన వెళ్తుంది.
అన్వయాము:
దేవుని ధృష్టిలో మనలను మనము చూచుకొనుటకు ఒకే మార్గము దేవుని వాక్యము అను అద్దములో చూచుకొనుట. మనకు క్యాన్సరు ఉన్నదని తెలియకపోతే సర్జరీకి వెళ్ళము. క్రైస్తవేతరులు తనను తాను పాపము కలిగిన వ్యక్తిగా చూచుకొనకపోతే, రక్షకుని అవసరతను కనుగొనడు. క్రైస్తవుడు తన పాపమును చూచుకొనకపోతే, తన పాపమును ఒప్పుకొనడు.
ఆత్మీయక్రైస్తవుడు పైవేశమును మించి తనుఏమైఉన్నడో అనే నిజస్థితికి వెళ్ళుతాకు ప్రయత్నిస్తాడు. బాహ్యరూపము ఒకవిషయము, వాస్తవికత మరో విషయము. ఈనాడు మనము నిజస్థితి గూర్చిఅతి తక్కువగా ఆలోచించే బాహ్యరూప సమాజములో ఉన్నాము. బాహ్యరూపమే సర్వము. తన బాహ్యరూపము కన్నా తన వాస్తవికతను గూర్చి ఎక్కువ ఆలోచన ఆత్మీయ క్రైస్తవుడు కలిగి ఉంటాడు.