వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా
23వ వచనములోని తలంపు 24వ వచనములో కొనసాగుతుంది.
వాడు తన్ను చూచుకొని
“చూచుకొని” అనుమాట స్పష్టముగా గ్రహించుట, సంపూర్తిగా అర్ధము చేసుకొనుట, దగ్గరగా పరిగణించుట అను భావముగాల లోతైన మాట. దేవుని వాక్యములోనికి నేరుగా చూచుటద్వారా తన ఆత్మీయ స్థితిని ఆ విశ్వాసి స్పష్టముగా చూడగలడు. దేవుని వాక్య అంతర్భావమును గురించి ఆలోచిస్తాడు, దాని యొక్క నియమములను జాగ్రత్తగా పరిగణిస్తాడు. దేవుని వాక్యమును గ్రహించే స్థాయికి చేరుకుంటాడు, తను నేర్చుకునినాదానిని వెంటనే ఉపేక్షిస్తాడు.
అవతలికి పోయి
అవతలికి పోయి అను మాట శాశ్వతముగా విడిచిపోవుట అను భావన కలది.తనెట్టివాడో దేవుని వాక్యముబయలుపరుచును కనుక దేవుని వాక్యము వద్దకు రాడు.
తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా
దేవుని వాక్యము యొక్క నియమములను గ్రహించుటలో స్పష్టమైన మరియు ఖచ్చితమైన గ్రహింపునకు వచ్చినప్పుడు, తన అనుభవముగూర్చి వాక్యము ఏమి చెప్పిందో వెంటనే మరచిపోతాడు. మరచిపోవుట అనుమాటకు నిర్లక్షము చేయుట లేక అలక్ష్యము చేయుట. దేవుని వాక్యా నియమములను స్పష్టముగా గ్రహిస్తాడు కానీ తన జీవితములో అవి ముఖ్యమైనవి కానివాటిగా వాటిని నిర్లక్ష్య పరుస్తాడు. తన జీవితముపై దేవుని నియమముల సందేశమును అలక్ష్యము చేస్తాడు.
నియమము:
దేవుని వాక్యమును తమ అనుభవాలకు అన్వయించుకొనని వారు స్వీయ మోసములో ఉన్నారు.
అన్వయము:
మనము ఎవరము, ఏమైఉన్నాము అను వాస్తవికతను విస్మరిస్తే, బైబిలు మన పాపమును మనకు బయలుపరుస్తుంది. మనజీవితానికి దేవుని వాక్య నియమాలను బదిలీచేయము. వాటి అంతర్భావాలకు మనము భయపడుతాము. మనపాపములను విడిచిపెట్టుటకు ఇష్టపడము.
ఇక్కడ విషయమేమిటంటే, దేవుని వాక్యపు విలువకు పైగా మన పాపముయొక్క విలువను విశ్వసిస్తాము కాగా దేవుని విలువలకన్నను మన స్వంత విలువలకు మన జీవితాన్ని సర్దుకుంటాము. దేవునికి మనము ఎలా అగుపడుతున్నామో అన్న విషయాన్ని ఎంతత్వరగా వీలైతే అంతా త్వరగా మర్చిపోవలనుకుంటాము. దేవుని ప్రణాళికకు వారుగా ఉన్నామన్న తలంపును మనము జీర్ణించుకోలేము కాబట్టి దానిని మనకు తిరస్కరించుకుంటాము. ఇది స్వయము యొక్క చిత్తశుద్దికి సంబందించిన విషయము.