మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.
మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ
మోసపుచ్చుకొనుట అనగా తప్పుగా ఎంచుట , తప్పుగా లెక్కించుట. రెండు గ్రీకు పదాలనుండి ఇది వస్తుంది : ప్రక్కగా, కారణము. తప్పు కారాణములచేత మనలను మనమే మోసపుచ్చుకొనుట. దేవుని నియమానుసారముగా స్థిరముగా జీవించుచున్నామని తప్పుగా ఎంచుకున్నప్పుడు మనలను మనమే మోసపుచ్చుకొనుచున్నాము. మానమున్నస్తితికన్న బాగున్నమనుకొని మనము మోసపుచ్చుకొనుటకు అవకాశం ఉన్నది.
ఎవడైనను చక్కని మాటలచేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. (కొలస్సీ 2:4).
దేవుని వాక్యమును అనుసరించవలసిన సమయములో దేవుని వాక్యమును ప్రతిసారి నిర్లక్షపెట్టుట లేక అవిధేయత చూపిస్తే మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాము. ఇడి ఆత్మీయ నిర్జీవతకు ఖక్కితమైన గురుతు. మనము వినుదానికి జవాబుదారులమన్నా స్పర్శ ఉండదు. అన్నిటికన్నా ఘోరమైన మోసము : స్వీయ మోసము చేసుకుంటాము. కుతర్కముతో మనలను మనమే ఒప్పించుకుంటాము.
నియమము:
మన అనుభవానికి అన్వయించకుండా కేవలము వినుట మాత్రమే మంచిలక్షణము అని నమ్మినప్పుడు స్వీయ మోసము జరుగుతుంది.
అన్వయము:
సంఘముకు హాజరగుటద్వారా, వాక్య బోధన వినుటద్వారా క్రైస్తవ్యములో క్రియాశీలముగా పాలుపొందుతున్నాను అని తలంచు క్రైస్తవుడు తనను తాను మోసగించుకొనుచున్నడు. స్వీయ మోసము మోసములలో ఘోరమైనది. ప్రకటింపబడినప్పుడు వినిన వాక్యమును ఆచరణలో పెట్టిన క్రైస్తవుడు సంపూర్తిగా నిమగ్నమైన క్రైస్తవుడు. దేవుని వాక్య నియమాలను వాడుకలో ఉంచుతాడు.
దేవుని వాక్యాన్ని స్థిరముగా వినుచూ ఎన్నడును ఆచరణలో పెట్టకపోతే మనము క్రైస్తవ్యాన్ని తప్పుగా అంచనావేసినట్లే. దేవునితో నడుచుచున్నానని ఎరిగిన క్రైస్తవుడు అత్యంత అశీర్వాదము పొందినవాడు.