Select Page
Read Introduction to James యాకోబు

 

అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.౹

 

అంగీకరించుడి

“సాత్వికముతో అంగీకరించుడి” అనే మాటలో “అంగీకరించుడి”. అనగా ఆహ్వానించుట.  దేవుని వాక్యమును స్వీకరించి, మన జీవితమునకు అన్వయించి, మనలోనికి ఆహ్వానించుట అను భావన.

ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడినవారందరిలో స్వాస్థ్య మనుగ్రహించుటకును శక్తి మంతుడు. (అపో.కా. 20:32).

నియమము:

దేవుని వాక్యము మనతో ఏమిచెబుతుందో దానిని మనము ఆహ్వానించినపుడు క్రియాశీల ఆత్మీయ ఎదుగుదల  జరుగుతుంది.

అన్వయము:

దేవుని వాక్యమును అంగీకరించుట, దానిని వినుట కంటే వెరైనది. దేవుని వాక్యమును వింటారు కానీ దేవుని వాక్యము వారిని పట్టుకొనదు, వారిలో మార్పు జరుగదు. దేవునికి సంపూర్ణాధికారము కలిగిన మనసుతో దేవుని వాక్యమునొద్దకు వెళ్ళినట్లైతే, ఆయన మన జీవితములో ప్రభావవంతంగా పనిచేస్తాడు.          

ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. (1 థెస్స 2:13).

Share