అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.
విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును
దుష్టత్వము మురికిని, చెత్తను సూచిస్తుంది. దుష్టత్వములోజీవించే వ్యక్తి నైతిక కల్మషము మరియు నీచత్వములో జీవిస్తాడు.
ఆదికమైపోవు దుష్టత్వము విర్రవీగే దుష్టత్వము. ఇది సామాన్య దుష్టత్వమునకు పైగా ఉండునది – ఇది అత్యంతసమృద్ధి మొత్తములో ఉన్న దుష్టత్వము. విర్రవీగుచున్న దుష్టత్వములౌన్న వ్యక్తి భ్రష్టమైన వ్యక్తి.
మూలభాషలో “విర్రవీగుచున్న” అను మాటకు చెవిలో అధికమైన గుబిలిని తెలుపుటకు ఉపయోగించే పదము. మన చెవులలో ఎక్కువ మైనము పేరుకుపోతే మనము సరిగా వినలేము. మన ఆత్మీయ చెవులు పాపము మూయబడితే మనము సత్యమునకు గ్రహీతలుగా ఉండలేము.
నియమము:
పాపము మనలను మలినము చేస్తుంది మరియు దానితో తీవ్రముగా వ్యవహరించాలి.
అన్వయము:
పాపము ఏ రూపములోనైనను దేవునితో మన సంబంధాన్ని మొద్దుబారునట్లు చేస్తుంది మరియు తనతో మన సంబంధాన్ని దూరముగా మళ్ళిస్తుంది. అసాధారణమైన దుష్టత్వములో క్రైస్తవులు జోక్యము కలిగిఉంటే లోతుగా దానితో వ్యవహరించాలి. దానిని వదలివేయాలి.