Select Page
Read Introduction to James యాకోబు

 

నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతిమనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.

 

కోపించుటకు నిదానించువాడునై యుండవలెను

ఈ వచనములోని మూడవ ఆజ్ఞ క్రైస్తవులను “కోపించుటకు నిదానించవలెనని” సవాలు చేస్తుంది. కోపమునకు మూల భాషలో అనేక పదములు కలవు. మన వచనములోని “కోపము” అను మాట ఒకరిమీద పగతీర్చుకోవలనే ఉద్దేశముకలిగి మనసులో కొంత కాలము నిలచిఉన్న కోపము.  మూలభాషలో కోపము అనగా లోపలి క్రోధముకు కదిలించిన విస్ఫోటం.  ఈభాగములో మన పదము స్వాభావికంగా తక్కువ చపలత కలిగిన కోపము కానీ ఎక్కువ కాలం నిలిచి ఉండుడానికి తెలుపుతుంది. అది లోలోపలానే మండుతుంది. అది ఒకరి పట్ల ద్వేషమును దాచిఉంచుకుని ఎక్కువకాలము ఉడుకుతుంది.

యాకోబు క్రైస్తవులు ఎన్నటికి కోపపడకూడదని చెప్పట్లేదు కానీ మనము కోపించే విషయములో నిదానించాలని చెప్తున్నాడు. మాట్లాడుటకు నిదానించుమను ఆజ్ఞ అన్నీ మాటలకు ఎలా అయితే  సంపూర్ణమైన ఆజ్ఞగా లేదో, అలానే కోపానికి విరుద్దముగా సంపూర్ణమైన ఆజ్ఞ లేదు. దేవునికి కూడా కోపం వస్తుంది. సమస్య కోపానిది కాదు కానీ కోపము యొక్క వేగము.

నియమము:

చిన్నగా పెరిగే కోపము, మన సంబంధాలలో తొందరపాటుతో చేయు తప్పిదాలు చేయకుండా మనలను కాపాడే దేవుని విదానము.

అన్వయము:

అన్నీ మనకనుకూలముగా జరగడానికి ఎడతెగకుండా ప్రయత్నిస్తున్నప్పుడు ప్రజలు ఆటంకాలు కలిగిస్తూ ఉంటే, ఫలితముగా సహజముగా కోపము వస్తుంది.

సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.౹ 32ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. (ఎఫెస్సీ 4:31-32).

త్వరగా కోపపడేవారు ఎదుటివ్యక్తితో సమస్య పరిష్కరించుటకు ఆశ ఉండదు. వారివైపే ఆలోచించుకుంటారు. ఇతరుల సమ్క్సేమము గూర్చి మనము పట్టించుకుంటే మనకు సామరస్యకరమైన ఫలితం వస్తుంది.

తీవ్రమైన పరిస్తితిలో కోపము లేని వ్యక్తి స్తిరమైన మాట ఇవ్వగలడు. దయతో కాకపోయినా మెల్లని జవాబును ఇస్తాడు. వివాదమును పరిష్కరించుటలో దేవుని పద్దతిని అనుసరిస్తే ఎంతో వేదనను మాన్పిపివేయవచ్చు.  దయగల మాట కోపాన్ని తగ్గిస్తుంది.

మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. (సామెతలు 15:1).

మనకోపమును అదుపులో ఉంచుకుంటే, గొప్ప జ్ఞానముగలవారిగా దేవుడు మనలను చూస్తాడు: 

దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. (సామెతలు 14:29).

తనకోపమును స్వాధీనములో ఉంచుకొనువాడు గొప్ప పరాక్రమవంతుడు

పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడుపట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు (సామెతలు 16:32).

Share