Select Page
Read Introduction to James యాకోబు

 

శ్రేప్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనా గమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.

 

ఆయనయందు ఏ చంచలత్వమైనను

దేవుని గుణము మరియు స్వభావము యొక్క తేజస్సు ఎప్పటికీ మారదు. ఆయన మార్పులేనివాడు.

యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు. (మలాకీ  3:6).”

యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. (హెబ్రీ  13:8).

మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా–దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు. (1 యోహాను 1:5).

గమనా గమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.

 “గమన గమనము” మార్పు, తేడా అను భావన. దేవుడు తన స్వభావములో మారడు. దేవుని గుణములో నీడ కలిగిన ఏ సంధార్భము లేదు. కనీసము ఒక్క మార్పు కూడా ఎన్నడూ తన గుణములో జరుగలేదు. నీడ సూర్యుని కడలికవలన మారుతుంది కనుక అది క్రమీణా మారుతుంది. దేవునిలో పరివర్తనము ఉండదు. 

నియమము:

దేవుడు మార్పులేనివాడు గనుక ఆయన తనకుతానుగా ఏకరీతిగాఉండుటనుగూర్చి  మనము ఆయనను నమ్మవచ్చు.

అన్వయము:

దేవుడు మార్పులేనివాడు. ఆయన తనను తాను మార్చుకోవడానికి సామర్ధ్యత లేదు, అంతకంటే ఎవరిచేత మార్చబడడు. కనుక మనము ఆయనను నమ్మ వచ్చు. తనకు తాను ఎల్లప్పుడు విశ్వసనీయుడు.

Share