శ్రేప్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనా గమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.
యాకోబు గేరు మార్చి చెడు నుంచి మంచి వైపు కదులుతున్నాడు, దురాశ యొక్క మూలమునుండి మనకోరకు దేవుని ఏర్పాటుకు.
శ్రేప్ఠమైన ప్రతియీవియు
యీవి అనుమాట ఇచ్చుటను తెల్పుతుంది. దాత మీద్ ఒక్కాణింపబడింది. ప్రతిఒక్క మంచి ఈవికి దేవుడు కర్త. మనము చెడుతనము చేయుటకు ఆయన ఎప్పటికీ కోరడు. ఆయన ఎప్పటికీ మంచినే చేస్తాడు. ఆయన ఇచ్చునదంతా తన గుణాలక్షణము మీద ఆధారపడి ఉంటుంది. మనము తప్పిపోయాము అన్న కారణముతో ఇచ్చుట మానడు.
మన లక్షణము మీద ఆధార పడక దేవుని లక్షణము మీద ఆధారపడి దేవుడు మనకు ఇస్తాడు. మనము ఎవరు ఏమైఉన్నాము అన్నదానిమీద ఆధారపడి దేవుడు ఎన్నడూ ఇవ్వడు. మనము దశమభాగాలను ఇస్తున్నాము గనుక, సాక్షమిస్తున్నాము గనుక, ప్రార్థన చేస్తున్నాము గనుక దేవుడు వాటిని దేవుడు మనలను ఆశీర్వదించడు. దేవుని నుండి ఏదియు మనము సంపాదించము అర్హులమూకాదు.
మంచి అనగా అంతర్గతంగా మంచి విలువ. మనకు దేవుని ఈవులు మంచివి ఎందుకంటే అవి దేవుని తన గుణము నుండి వచ్చుచున్నవి, మన ప్రదర్శన వలన కాదు. దేవుడు మంచివాడు గనుక దేవుని ఈవులు వీటి అంతర్గత వీలువను పోగొట్టుకోవు. మనము తప్పిపోయినను దేవుడు మనకు ఇవ్వడము మానివేయడు. దేవుడు మంచివాడు కాదు, దాతృత్వము గలవాడు కాదు అని ఆరోపించడము ఆయన ఏమైఉన్నాడో దానిని వక్రీకరిస్తున్నాము.
సంపూర్ణమైన ప్రతి వరమును
ముందు చెప్పిన “ఈవి” అనుమాట ఇప్పుడు వాడిన “వారము” అనుమాట వేరైనది. ఇచ్చుటకన్న ఇవ్వబడిన దానిని సూచిస్తుంది. ఉదారత్వముతో, ఉపకారముగా ఇవ్వబడిన బహుమానము. మొదటి పదము “ ఈవి” దానమును ఒక్కాణిస్తుంది, రెండవ మాట “వరము” మనకు ఇచ్చుటలో దేవుని దాతృత్వమును ఒక్కాణిస్తుంది. మంచి వరములకు దేవుడు దాత మరియు దాతృత్వపు మూలము.
“ప్రతి” అనుమాట ఇచ్చుటకు ఆశగల సమస్తమును కలిగిఉన్న దేవుని స్వభావమును సూచిస్తుంది. దేవుడు ఇచ్చునది ఏదైనా ఆత్మీయమైనదైనా, భౌతికమైనదైనా, సాంఘికమైనదైనా అది సంపూర్ణమైనది.
పరసంబంధమైనదై,
దేవుని బహుమానలకు మనము అర్హులము కాము. తన కృపనుబట్టి పరమునుండి దేవుడు తన బహుమానములను దయచేస్తాడు. మన ఈవుల మూలము దేవుని వ్యక్తిత్వములో ఉన్నది.
జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును
“జ్యోతిర్మయుడైన తండ్రి” అనునది దేవునికి ఆకాశ జ్యోతులైన సూర్య చంద్ర నక్షత్రముల సృష్టికర్తగా సూచన.
నియమము:
దేవుదు మనకు ఇచ్చుటలో దాతృత్వము కలిగిఉన్నాడు.
అన్వయము:
దేవుడు మనలను నిరాశ పర్చడు. మనము తప్పిపోయిన, మనపట్ల ఆయన తప్పిపోడు. ఈ భూమండలము పైన ఉండడానికి మనకు అధికారము లేదు. మనము మరణము నరకముకు పాత్రులము. కేవలం తన కృపను బట్టి దేవుడు మనలను ఈ భూమిపై నడువనిస్తున్నాడు. దేనికొరకు మనలను క్రయము అడుగడు. మనము అనుభవించే సూర్యరశ్మికొరకు ఆయనకు వెల చెల్లించము.
తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? (రోమా 8:32)
ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ జేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల? (1 కొరిం 4:7)
కొందరికి అధికమైన ఐ.క్యు. ఉంటుంది. ఆ సామర్ధ్యం వారికి వారు ఇచ్చుకోలేదు. దేవుడు వారికి ఆ మానసిక సామర్ధ్యం ఇచ్చాడు. మనము కలిగి ఉన్నదంతా “దేవుని నుండి” మనకు వచ్చినదే. మనము ఎవరము, ఏమి చేస్తాము అను దానికి మనము మెప్పుపొందడానికి ఇష్టపడుతాము. మనము ఆగి ఆలోచిస్తే, మనము మార్పు చెందని దేవుని కృపానుబట్టి పనిచేస్తాము. మనము కలిగిఉన్న ఏ అభివృద్దిఅయినా దేవుని నుండి వచ్చినదే.