నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి.
16వ వచనము ముందు వెనుకఉన్న వచనముల భావనలను కలుపుతుంది. వారి పాపమును బట్టి దేవునిని నిందించువారు దేవుని స్వభావమును గూర్చి కొంచెం తెలుసుకోవాలి.
మోసపోకుడి.
మోసము సత్యమునుండి తొలగిపోయేట్లుగా చేస్తుంది.
దేవుని స్వభావము గూర్చి ఒక ఖచ్చితమైన అపార్ధమునకు వ్యతిరేకముగా రోమా ప్రపంచములో చెదరిఉన్న విశ్వాసులను యాకోబు హెచ్చరిస్తున్నాడు. (17, 18 వచనాలు). దేవుని స్వభావమును అపార్ధము చేసుకొనుట అను అత్యంత మౌళిక తప్పిదమును మనము చేయవచ్చు. దేవుని స్వభావానికి చెడును ఆపాదిస్తే (13 వ.) మనము అత్యంత భయంకరమైన తప్పును చేసినవారమౌతాము. దేవుడు మంచికి మూలము (17 వ.), పాపమునకు కాదు.
నా ప్రియ సహోదరులారా
తను పరిచర్య చేయువారిని స్పష్టంగా ప్రేమిస్తున్నాడు. ప్రేమ యొక్క లక్ష్యముగా ఉండుట అద్భుతము. దేవుని కుటుంభములో ఉండుట ఒక ఎత్తైతే, దేవుని కుటుంబ సభ్యునిగా ఉండుట మరో ఎత్తు.
కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్న నా ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి. (ఫిలిప్పీ 4:1).
నియమము:
దేవుని సిద్ధాంతము క్రైస్తవ మూల సిద్ధాంతము.
అన్వయము :
దేవుని స్వభావము గూర్చిన సిద్దాంతములో తప్పిపోతే, తప్పిదములో తిరుగులాడుతాము. క్రైస్తవ్య స్వభావము గూర్చి ప్రజలు మనలను మోసము చేయవచ్చు. సైద్దాంత్తికముగా అన్నీ రకములైన అస్తవ్యస్తతకు తొలగిపోతాము.