దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు–నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.
ఎవడైనను శోధింపబడినప్పుడు–నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.
శ్రమలనుండి శోధనలు వస్తాయి. శ్రమలు దేవుని నుండి వస్తాయి కానీ శోధనలు దేవునిలో ఆరంభం కావు.
మన పాపానికి దేవుని మీద నింద వేయడానికి ప్రయత్నిస్తాము. దానిలో నిండా మనమీద రాకుండా చూస్కుంటాము. ఇది దేవునిని నియంత్రించడము. మనము మన పరిసరాలను, మన్ జన్యువులను, మన సాంప్రదాయాలను ఇంకా దేవునిని కూడా నిందించడానికి ఇష్టపడుతాము. ఇదంతా బదిలింపు సమస్య. మరొకరికి మన బాధ్యతను బదిలీ చేయాలనుకుంటాము. దేవుని గుణములలో దేనిని నిందించడానికి అవకాశము లేదు.
తన పాపానికి ఆదాము హవ్వను నిందించే ప్రయత్నంచేశాడు. ఆదాము హవ్వను, హవ్వ సర్పాన్ని నిందించారు. సైతాను నన్ను అలా చేయించింది అనే వైఖిరికి స్థానము లేదు.
అందుకు ఆదాము–నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను. (ఆది 3:12-13).
చెడుతనానికి లొంగడానికి దేవుడు తోటలో చెట్టు నిర్మించలేదు కానీ వారి విశ్వాసమును పరీక్షించుటకు లేక నిరూపించుటకే. దేవుడు శోధనకు ప్రత్యక్ష కారకుడుకాడు. “చేత” అను మాట దేవుడు పరోక్ష కారకుడు అని సూచిస్తుంది. మనము పాపమునకు లోబడుటకు దేవుడు పరోక్షముగాకూడా జవాబుదారీ కాడు. మనలను నిరూపించడానికి దేవుడు మనలను పరీక్షిస్తాడు; చెడు చేయించుటకు మనలను ఎన్నడూ శోధించడు.
నియమము:
మన పాపములకు సాకులు వెదకడానికి ప్రయత్నం చేస్తాము.
అన్వయము:
మన పాపానికి బాద్యతవహించడం మనకు కష్టము కనుక ఇతరులమీదనో, ఇంకా దేవుని మీదనో నింద నెట్టడానికి ప్రయత్నిస్తాము. వాస్తవాల ఎదుట మనకు మనము సమర్ధించుకోడానికి మనము సాకులు చెప్తాము.
క్రైస్తవులు వంశపారంపార్యమును, పరిస్తితులను, మన జన్యువులను, మన సంప్రదాయ సంధార్బాలాను నిందించకూడదు. “దేవుడు నన్ను ఈ పరిస్తితులలో ఉంచాడు కాబట్టి ఈ పరిస్తిలో నేను ఉండడము దేవుని తప్పిదము” అని మనము అనకూడదు. ఆత్మీయ మనసు కలిగిన క్రైస్తవుడు దాచుకోడానికి ప్రయత్నించక పాపానికి బాధ్యత వహిస్తాడు. “నేను నా భార్య మీద కోపపడ్డాను” అని దేవునితో చెప్పడము కష్టము.