శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.
తన్ను ప్రేమించువారికి
శ్రమలద్వారా వెళ్తున్నవారికి ఉత్ప్రేరణ దేవుని పట్ల ప్రేమ. దేవుని పట్ల వారికున్న ప్రేమ శ్రమల ద్వారా వారిని మోసుకొనివెళ్తుంది. దేవునిపట్ల మనకున్న ప్రేమకు, శ్రమలలో ఓర్పుకలిగిఉండుటకు మన సమ్మతికి స్పష్టమైన సంబంధం ఉంది. ప్రేమబంధమును ప్రేమ బలముగా ఉంచుతుంది, పై ఆకర్షణ కాదు. మనము దేవుడు ఏమైఉన్నడో అందునుబట్టి ప్రేమిస్తాము కానీ, ఆయన ఏమైఉండాలో దానిని బట్టి కాదు.
తనను ప్రేమించేవారికి దేవుడు తన కిరీటమును ఇస్తాడు. మూలభాషలో, “తనను ప్రేమిస్తూ ఉండువారికి” అని భావన వస్తుంది. అప్పుడప్పుడు ఆయనను ప్రేమించువారిని కాదు కానీ నిరాటంకముగా ఆయనను ప్రేమించువారిని దేవుడు సత్కరిస్తాడు. ఇట్టి వారు ఏట్టి స్తితిలోనైనా తమ జీవితాంతము ఆయనను ప్రేమిస్తారు.
నియమము:
శ్రమలో ఓర్పు సజీవమైన క్రియాశీలమైన విశ్వాసానికి ఋజువు.
అన్వయము:
దేవుని ప్రేమించువారు శ్రమలో ఓర్పుకలిగి ఉంటారు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము (1యోహాను 4:19). ఆయనము ప్రేమించక పోతే మనము శాపము క్రింద పనిచేస్తున్నాము. (1 కొరిం 16:22)