Select Page
Read Introduction to James యాకోబు

 

శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

 

ధన్యుడు

 “ధన్యుడు” అనుమాట సంతోషముగాలవాడు అని భావనకంటే ఎక్కువైనది. “ధన్యుడు” దేవుని కృపాను పొందుటకు యోగ్యతను పొందినవాడు అను భావన. ఆ ధన్యతను పొందుటకు దేవుని నిబంధనను సంతృప్తి పరచు క్రైస్తవుడు ఒకానొక ప్రతికూల సంధార్బాన్ని అనుభవిస్తాడు. అతడు వాస్తవముగా అదృష్టవంతుడు.

ధన్యుడు అను మాట ధాన్యతలల్లో (మత్తయి 5) వాడబడిన మాటయే. ధన్యత బయటి పరిస్తితులు ప్రభావితముచేయని స్థితి. అది మనలో కలిగి ఉండునది. అది దేవునినుండి మనము పొందుకొనునది మరియు ఆయననుండి వేరుగా మనము సంపాదించలేము.అది దేవునిని మనము ఆనందించు స్థితి.

దేవునిని క్రొత్త నిబంధన “ధన్యునిగా” పిలుస్తుంది.

అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము, (1 తిమో 1:8).

శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.౹ 16సమీ పింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్. (1 తిమోతి 6:15-16).

నియమము:

దేవుని మూలమునుండి మనకు సంతృప్తి అనుభూతి కలుగుతుంది.

అన్వయము:

దేవునితో సత్సంబంధం ఉండుటవలన ధన్యతను మనలో వహించవచ్చు. ధన్యతనుగూర్చిన స్పర్శ అనేక క్రైస్తవులు కలిగిఉండరు. దేవుని నుండి దూరముగా జీవించుటవలన దేవుడు కలిగిఉన్నవి వారు కలిగిఉండరు.

ఏమియు అవసరము లేనివారు ధన్యులు. లోకమునుండి  వారు స్వతంత్రులు. వారు వారి వైపు వచ్చు అదృష్టము మీద కాదు కానీ, వారి లోపల ఉన్న దైవిక వనరులమీద ఆధారపడుతారు. 

Share