….ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.
9వ వచనములో యాకోబు ఆర్ధికముగా దీనులైన వారిని గూర్చి అభిప్రాయాన్ని ఇచ్చాడు, ఇప్పుడు ఈ వచనములో ఆర్ధికముగా ధనికులైన వారిని గూర్చి అభిప్రాయాన్ని ఇస్తున్నాడు. దీనులైనవారు ఆత్మీయ సంపాదను గూర్చి అతిశయించాలి మరియు ధనికులైనవారు నిత్యమైన వాటిగూర్చి అతిశయించాలి.
ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు
ధనవంతులైనవారిలో దీనదశ ఉన్నది – వారు ఒక దినమున మరణిస్తారు. వారి సంపన్న స్థితి శాశ్వతకాలము నిలువదు. ధనికుడైన వ్యక్తి తన మరణమునందు భవిష్యత్తు దీనస్తీతినిగూర్చి అతిశయించవచ్చు ఎందుకంటే తనకు ముందు నిత్యత్వ భవిష్యత్తు ఉన్నది.
ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును.
పరలోకములో ధనవంతులు ఉన్నత స్థానములో ఉండరు. ధనము తన అధికారాన్ని అక్కడ ఇవ్వదు. గడ్డిపువ్వువలె తన సంపద గతించిపోవును.
నియమము:
భూలోక సంపద ఆశాశ్వతము; నిత్యత్వ సంపద నిత్యము నిలుస్తుంది.
అన్వయము:
నిత్యవపు ధృక్కోణమును మన క్రైస్తవ జీవితం కలిగిఉండుట ఎంతో ముఖ్యము. మనము ఈ జీవితములో ఎంతో విచామును ఎదుర్కుంటాము. ఆర్ధిక ఒడిదుడుకులు, సన్నిహితుల మరణము మనలను మోకరింపజేస్తాయి. ధనము మనలను అట్టి శ్రమలనుండి తప్పించలేదు. ధనికులు, దీనులు ఇద్దరూ దేవుని ఎదుట తమకు తాము సాగిలపడుతారు.
కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. (2 కొరిం 4:16-18).