Select Page
Read Introduction to James యాకోబు

 

అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.

 

సందేహింపక

మూలభాషలో, సందేహింపక అనే మాటకు, అంతటా వేరు చేయుట లేక సంపూర్ణముగా వేరుచేయుట. మనుషులు దేవునిని సందేహించినప్పుడు, ఆయనకు విరోధముగా బేధాభిప్రయము కలిగి వారి మనసులో వేరుచేయబడినవారై వుంటారు. తమకు తాముగా దేవునినుండి వేరౌతారు. దేవునివాక్యానికి వారి స్వకీయ నమ్మకాలను ఎన్నుకుంటారు.

సందేహించుట అనగా విమర్శాత్మక మనసు కలిగివుండుట. తను చూచువాటిగురించి వాదిస్తూ, వాస్తవాలను నమ్మలేడు. సందేహించువాడు వాస్తవాలనుండి తాను నమ్ముదానిని వేరుచేస్తే, తాను నమ్మునది అపేక్షించదగని దానిగా చేస్తుంది. మానవ దృక్పథంనుండి అది అసాధ్యమని తలంచితే, దేవుడు ఆ ప్రార్ధనను ఆలకిస్తాడు అని విశ్వసించడు. ప్రార్ధనమీద తన భావన అంతా మానవ సంభావ్యత మీదనే గాని, తన పక్షముగా దేవుడు  అతీతమైన రీతిలో జోక్యం చేస్కుంటాడు అని కాదు.

సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.

సందేహించువాడు సముద్రతీరములో బండలను గుద్దుకుని వెనుకకు వెళ్ళు తరంగమును పోలిఉంటాడు.  సందేహించువారు అస్థిరులు. కొన్నిసార్లు నమ్ముతారు మరికొన్నిసార్లు నమ్మరు. విశ్వాససహితమైన ప్రార్థన దేవుని మీద క్రమక్రమంగా నమ్మిక ఉంచుతుంది. అనిశ్చయమైన ద్వంద్వ మనసు కలిగిన విశ్వాసి విజయవంతమైన ప్రార్థన అభ్యసించడు. అట్టి వారు తమమీద తామే విరోధభావము కలిగిఉంటారు.  సముద్రపు అలా ఎలా ఐతే క్రియాశీలముగా ఉండి అంతాగా సాధించదో, అలానే క్రైస్తవుడు ప్రార్ధనలో  క్రియాశీలముగా ఉండి అంతాగా సాధించడు. ఉద్దేశములేని ప్రార్థన శూన్యమైనది నిష్ప్రయోజనమైనది. దేవుని గుణాన్ని శంకిస్తుంది.

తనకు కేంద్ర బిందువు లేనందున, రుబేను నీటివలే చంచలుడు (ఆది 49:4) పరిస్తితులు తనను ఒకసారి ఒకవైపు మరోసారి మరోవైపు నెట్టసాగాయి. కొందరు క్రైస్తవులకు

 పరిస్తితులు బాగుగా ఉన్నప్పుడు అలయొక్క శ్రేణిలో పయనిస్తారు. పరిస్తుతులు మారినప్పుడు క్రింది స్థానములోకి వెళ్తారు. దేవునియందు విశ్వాస వెన్నుపలక వారికి అవసరము. అది వారికి స్థిరత్వాన్ని ఇస్తుంది. భయానక వాతావరణములో  వెన్నుపలక విరిగిన నావ ప్రయాణము ఎంతో కష్టతరమమౌతుంది.  అనుదిన క్రియాత్మక విశ్వాసములేని క్రైస్తవులు కష్టతరమైన ప్రయాణములో ఉన్నారు ఎందుకంటే,  అనుభవము అనే నావ మునిగిపోయే సమయములో వారికి నమ్మదగిన ఓడ నావికుడు లేడు.

అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక ( ఎఫెస్సీ 4:14)

నియమము:

అనుమానము ఆస్తిరత్వాన్ని కంటుంది, కానీ విశ్వాసము ఆత్మకు స్టిరాత్వాన్ని తెస్తుంది.

అన్వయము :

దేవుని యందు విశవాసము లేకుండా ప్రార్ధించే క్రైస్తవుడు ముందుకు వెనుకకు కదులు తరంగము వంటివాడు. అది ఎక్కడికి పురోగతి సాగించదు. విశ్వాసము లేకుండ ప్రార్థన ముందుకు సాగదు. విశ్వాస సహిత ప్రార్థన, శ్రమలో దేవునికి సమస్తము అప్పగించడమనే ఏకైక ఉద్దేశము కలిగిఉంది.

నీవు పొందుకొనుటకు ఊహించనిదానికొరకు  దేవుని అడుగుట అర్ధరహితము. ఇది దేవుడు తన వాగ్ధానములను నెరవేర్చునను విశ్వసనియ్యతను అగౌరవపర్చడమే.

జవాబివ్వడానికి దేవుని ఇష్టతను సామర్ధ్యతను నమ్మని ప్రార్థన దేవుని గుణాలక్షణముకు అవమానకరము. సందేహము విశ్వాసమునకు వ్యతేరేకము  మరియు దేవుని లక్షణమును ఆక్షేపిస్తుంది. మనము దేవుని విశ్వసనీయతపై నమ్మికవుంచాలిని కోరుకుంటున్నాడు. ఆయన మనపట్ల  ఎల్లప్పుడు నమ్మదగినవాడు గనుక ఆయన మనకు మాటతప్పడు. 

విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. (హెబ్రీ 11: 6).

Share