Select Page
Read Introduction to James యాకోబు

 

మీరు సంపూర్ణులును, అనూనాంగులును,ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.

 

అనూనాంగులును,

ప్రతి భాగములో “సంపూర్ణత” అనే భావన కనిపిస్తుంది.  “సంపూర్ణత”  రెండుపదాల నుండి వస్తుంది :

మెత్తము, భాగములు పరిణతిచెందిన వ్యక్తి భాగములన్నీ వాటి స్థానములలో కలిగియుంటాడు. ఈ పరిణతిస్థాయికి చేరిన వ్యక్తి ఏ ఆత్మీయ ఎదుగుదలను కొదువగా కలిగియుండడు. తన జీవితంలో అస్వస్థ ఆత్మీయ పరిమాణం ఏదీ లేదు. అటువంటి వాడు సంపూర్ణ, నిండు క్రైస్తవుడు.

సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును. (1 థెస్స 5:23-24).

ద్వితియోపదేశకాండములో “సంపూర్ణత”అను పదము చెక్కబడని, నునుపు చేయబడని రాళ్ళకు ఉపయోగింపబడింది. అవి దేనిని పోగొట్టుకొనక తమ వాస్తవికతను కాపాడుకున్నాయి గనుక అవి సంపూర్ణమైనవి.

చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యెహోవాకు దహనబలుల నర్పింపవలెను. (ద్వితి 27:6).

ఏ విషయములోనైనను కొదువలేనివారునై

కొదువ విడిచిపెట్టుట, వదలివేయుట,  వెనుకబడుట, విడిచిపెట్టబడుటను సూచిస్తుంది. ఈ విశ్వసి దేవునిమీద నెపంవేయడు. అతని ఆత్మీయ ఎదుగుదలలో ఏ లోపము కనిపించదు. పరిణతిచెందిన విశ్వాసిలో ఆత్మీయ విశేషాలలో లోటు ఉండదు.  పరిణతి చెందిన విశ్వాసులు పరిణతి చెందని విశ్వాసులను వెనుక విడిచిపెడతారు.

నియమం:

ఓర్పు కలిగియుండడానికి గల ప్రతి నిర్ణయం మరింత ఎదుగుదలకు బలమైన భూమికను నిర్మిస్తుంది.

అన్వయం :

విశ్వాసము ద్వారా ఓర్పువారిని వికసించుటకు అవకాశము పొందకమునుపే కొందరు క్రైస్తవులు ఆశ వదలుకుంటారు. దేవుడు వారు ఏమైయుండాలనుకుంటాడో, ఆ స్థాయికి ఎన్నడు చేరుకోరు. వారు దేవునినుండి తెల్సుకోవాలనుకునే విషయం దేవుని శ్రమ నేర్పేముందే వారు తొలగిపోతారు. నొప్పి అధికముగా ఉన్నందున, గమ్యమును చేరక ముందే  పందెమును విడిచిపెడ్తారు. మనకు మేలైనదానికి బదులుగా మనకు అనుకూలమైనవాటితో విషయాలను కొలుస్తాము.   

బాధలో ఓర్పు కలిగియుండుటకు నిశ్చయించుకొనుట విధివాదముకాదు, పరిత్యగముకాదు. నిరాశ దైవిక లక్షణం కాదు. మన జీవితంపట్ల దేవునికిగల ప్రణాళిక మీద విశ్వాసముతో సహించుట, మానవ స్వభావాన్ని నిర్దేశిస్తుంది గాని దానిని నింపదు.

మన సమస్యలను సమర్థవంతంగా ఉపయోగించుకొనుటకు, దేనినైనా భరించడానికి  దేవునికిగల ప్రణాళిక మీద విశ్వాసమువలనైన సహనము తోడ్పడుతుంది. ఎదుర్కునే ప్రతి కార్యము బలమైన గుణము మరియు యోగ్యకు కారణము. ప్రతి విశ్వాసవిజయము భావివిజయానికి గొప్పవేదికను నిర్మిస్తుంది. మనం అభ్యసించే ప్రతి విశ్వాసచర్య, పరిణతికి ఆధారమును బలపరచడమో లేదా బలహీనపర్చడమో జరుగుతుంది. ఏదొక సమయంలో దేవుని ప్రణాళికకు సరిపడేవారిగానో లేక సరిపడనివారిగానో ఉంటాము.

దేవుడు మనము క్రైస్తవ పరిపక్వతలో పి.హెచ్డ్ డి పొందాలని ఆశ. మనలో అనేకులు క్రింది తరగతి స్కూలులోనే మానివేస్తాము. ఎక్కడా ఆగక, సాగిపోవువారు క్రైస్తవ పరిపక్వతలో అత్యున్నతమైన పట్టాను పొందుకుంటారు.

Share