Select Page
Read Introduction to James యాకోబు

 

మీరు సంపూర్ణులును, అనూనాంగులును,ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.

 

3వ వచనము తట్టుకని నిలబడే శక్తి, దేవుని శ్రమల పరీక్షవలన  కలుగుతుందని గుర్తుచేస్తుంది.

 ఓర్పు మన మీద జరుపు క్రియను ఈ వచనము తెలుపుతుంది.

మనను సంపూర్ణులుగా

అనూనాంగులుగా

ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు చేస్తుంది.

శ్రమలలో విశ్వాసమును అభ్యాసము చేయువారికి ఓర్పు స్పష్ఠమైన ప్రయోజనాలు కల్పిస్తుంది.

ఓర్పు తన క్రియను

నిజమైన విశ్వాసము ఓర్పుకు కారణము, నిజమైన ఓర్పు పరిపక్వతకు కారణము. తన జీవితములో ఓర్పు యొక్క పని యొక్క సంపూర్ణ బలానికి హద్దులు నిర్మించకుండా విశ్వాసి కాపాడుకోవాలి. ఓర్పు చుట్టు పరిభ్రమించే విషయాలపై తన యిష్టాన్ని ఇచ్చుకోవాలి. మన జీవితంలో దేవుని కార్యాన్ని ఎదిరించకుండా ఉండుట ఆవశ్యకము. మనలో అనేకులు మన జీవితంలో శ్రమకు గల దేవునికి గల ప్రణాళికకు లోబడకుండా దానికి విరుద్ధముగా వాదిస్తుంటాము.

కొనసాగింపనీయుడి.

ఓర్పుయొక్క మూడు ఫలితాలు : మనను సంపూర్ణులుగా, అనూనాంగులుగా, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు చేయుట. మన జీవితంలో పనిచేసే ఓర్పు యొక్క నియమము యొక్క ప్రభావము.

పని అను మాట ఓర్పు క్రియాత్మకముగా ఉంది కాని నిష్క్రియాత్మకంగా లేదు. అధిక శ్రమ మనను నిరుత్సాహపర్చకూడదు, ఓడించకూడదు. దానికి బదులుగా ఓర్పు శ్రమను ఓర్చుకునే శక్తిని తయారుచేస్తుంది. అది కదలికలేనిది కాదు. ఓర్పుతో మనము శ్రమను తట్టుకోగలిగితే, దేవుడు వాటిని మన జీవితంలో ఉంచిన ఉద్దేశాన్ని చేరుకోగలము. 

నియమం :

ఓర్పు నుండి ఆత్మీయ పరిపక్వత కలుగుతుంది.

అన్వయం :

పరీక్షింపబడిన విశ్వాసము నుండి ఓర్పు కలుగుతుంది మరియు ఓర్పు పరిపక్వత యొక్క ఫలాలను కలిగిస్తుంది. మన విశ్వసము ఎంత నిజమైనదో చూపుతుంది కనుక, శ్రమ మన వ్యకిగత అభివృధ్దికి అవసరము.  మనమెదుర్కునే ప్రతి శ్రమ వెనుక దేవుడు ప్రణాళిక కలిగియున్నాడు. వజ్రానికి సానబెట్టుట (పాలిషింగ్) అవసరము, ఫలానికి కత్తిరింపు అవసరము. 

ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను.ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును. (యోబు 13:15).

మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?  కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా? వారు కొన్నిదినములమట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించు చున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు.  అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. (హెబ్రీ  12:5-11).

Share