నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,
ఓర్పును పుట్టించునని
“పుట్టించును” అనగా “కలిగుంచును”. జరిగించుట, త్వరితముగా చెయుట అని అర్ధము వస్తుంది. శ్రమలు నిశ్చలమైన విశ్వాసమును పూర్తిగా ఉత్పత్తి చెస్తాయి. మన జీవితములొ ఒక ప్రాంతములొ జరిగే పరీక్ష మరో ప్రాంతములొ బలాన్నిపుట్టిస్తాయి.
ఓర్పుకు గ్రీకుభాషలో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి, మనుషులపట్ల ఓర్పు (మన పదము కాదు), రెండవది పరిస్ఠితులపట్ల ఓర్పు. ఈ వచనములొని ఓర్పు, రెండు పదాలనుండి వస్తుంది : క్రింద ఉండుట, నిలిచి ఉండుట. క్రింద నిలిచిఉండుట అని అర్ధము వస్తుంది. మన పదము, నిలిచి ఉండే శక్తి,
కష్టమైన పరిస్తితులలో కదలకుండా ఉండు సామర్ధ్యమును గూర్చినది. కష్టమైన పరిస్తితులలో ధృఢమైన లక్షణము. ఆ వ్యక్తి తప్పించుకుని వెళ్ళడు. నిష్క్రియాత్మక ఓర్పు గా ఉండక, ధృఢత్వమును తెలియజెస్తుఁది.
నియమము:
పౌరుషమతో దేవుని బిడ్డ విశ్వాసాన్ని బలపరచడానికి శ్రమలను దేవుడు వాడుకుంటాడు.
అన్వయము :–
ఓర్పుగలవ్యక్తి విడచిపోకుండా నిలబడతాడు ; తన జీవితంపట్ల దేవునికి గల ప్రణాళికను సాధించడానికి అధిగమిస్తాడు. తన విశ్వాసము స్థిరముగా ఉండును. తన సమస్యలనుండి పారిపోడుగాని వాటిని ముఖాముఖిగా ఎదుర్కొంటాడు.
“ఓర్పు” అనే తలంపు, శ్రమలో పట్టుదలను గూర్చినది. దేవుని ప్రణాళికపై నమ్మికతో మనము శ్రమను ఎదుర్కొంటే, శీలము బలపడుట అను బహుమానము పొందుతాము. విశ్వాసము పరీక్షింపబడిన ప్రతిసారి మన ఓర్పు బలపర్చబడుతుంది. శ్రమ తట్టుకునే శక్తిని కల్గిస్తుంది.
యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను. (కీర్తన 40:1).”
విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు,
మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవు నికి కృతజ్ఞతాస్తు తులు చెల్లించుచున్నాము.
ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. (1థెస్స 1:2-4).
దేవునియందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక. (2 థెస్స 3:5).
శ్రమకు ఎలా స్పందిస్తావు అనుకూలముగానా లేక ప్రతికూలముగానా ? ప్రతికూలముగా స్పందిస్తే, మన జీవితముపై దేవుని ప్రణాళికపై అపనమ్మికను సూచిస్తుంది. మన బుద్ధిని మెరుగుపర్చడానికి దేవుడు శ్రమలను వినియోగిస్తాడు. శ్రమను జయించిన ప్రతిసారి ఆత్మీయంగా బలపడుతాము.
శ్రమ అనే పాఠశాలలో దేవుడు మనందరిని పెడ్తాడు. విశ్వాసంతో ఈ తర్భీదును పొందిన ప్రతి ఒకరు ధృఢమైన గుణమును (బుద్ధిని) పెంపొందుకుంటారు. ఎంతటి కష్టతరమైన పరిస్తితైనా అక్కడే నిలబడుతాడు.
అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. (రోమా 5:3-4).
ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.
నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును.
మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును,
అనగా ఆత్మరక్షణను పొందుచు,చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు. (1 పేతురు 1:6-9)