Select Page
Read Introduction to James యాకోబు

 

నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,

 

మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష

మన విశ్వాసమునకు కలుగు పరీక్ష ఉద్దేశము మన విశ్వాసము ఎంత నిజమైనదో, బలమైనదో చూపడానికి. “పరీక్ష” అనగా నిరూపణ. మన విశ్వాసము ఎంత నికార్సైనదో దెవుడు రుజువు చేయాలనుకుంటున్నాడు.  

ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.

నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును.

మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును,

అనగా ఆత్మరక్షణను పొందుచు,చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు. (1 పేతురు 1:6-8).

యాకోబు పత్రికలో “విశ్వాసము” పదహారు మారులు పీర్కొనబడింది. యాకోబు పత్రిక విశ్వాసమును ఎత్తిచూపుతుంది. కార్యములకు ఇంజను వలె విశ్వాసము చూపబడింది. క్రియలు విశ్వాసమును అధిగమించలెదు కాని క్రియలకు విశ్వాసము మూలముగా చూపబడింది.

విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. (హెబ్రీ 11:6).

నియమము:

దేవుడు మన విశ్వాసము ఎంత నికార్సైనదో శ్రమద్వారా నిరూపిస్తాడు.

అన్వయము:

మన విశ్వాసమును దేవుడు పరీక్షిస్తాడు అని మనము గుర్తించాలి. మన విశ్వాసాన్ని దేవుడు ఎంత విలువ ఇస్తాడు అంటే, విశ్వాసాన్ని బలపరచడానికి దానిని పరీక్షకు గురిచేస్తాడు.  దేవుడు మన విశ్వాసము యొక్క వాస్తవికతను ధ్రువీకరించాలనుకుంటున్నడు. నమ్మకమైన విశ్వాసము అసలైన విశ్వాసము.

నిజమైన సువర్ణము వంటి విశ్వాసము కలిగి ఉన్నమో లేదో అని శ్రమల పరీక్ష రుజువు చేస్తుంది. అత్యంత శక్తివంతమైన క్రైస్తవ జీవిత నియమముగా అగ్నిపరీక్ష విశ్వసమును చూపుతుంది.

Share