Select Page
Read Introduction to James యాకోబు

 

నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి,

 

యెరిగి,

సరైన వైఖరి ఉంటె సరిపోదు, శ్రమలు గురించి సరైన అవగహన ఉండాలి. ఎరుగుట అను పదము గ్రీకులో “ఎరుగుట” అనగా వ్యక్తిగత అనుభవము నుండి కలుగు వ్యక్తిగత పరిచయము. విశ్వాసము ఓర్పు పుట్టిస్తుంది అని  యాకోబు పత్రిక పాఠకులు వ్యక్తిగత అనుభవమువలన తెలుసుకున్నారు.

నియమము :

నిజక్రైస్తవ్యము మనము వాస్తవముగా ఎమైఉన్నామో  దానిని ఎదుర్కొను ఆవశ్యకతకలిగిఉంది.

అన్వయము:

మనలొ ప్రతి ఒకరు ఎవరికి వారు తమను ఎదుర్కోవాలి. దీనిని మనము నిజముగా జరిగిస్తే, మన విశ్వాసము శ్రమలొ ఓర్పు కలిగిఉండగలము.  విశ్వాసముకు కలుగు పరీక్ష పట్టుదల కలిగిస్తుంది అని విశ్వాసము ద్వారా ఎరిగితే శ్రమలో బలముగా ఉండగలము.

మనము ఎదురుకొను ప్రతి సందర్భము మన “ఓర్పును”  పెంచుటకు అని గ్రహించుటకు విశ్వాస సాక్షి సమూహము మరియు యేసు మనకు మాదిరి.  మన జీవితములొ మనము ఎదురుకొను ప్రతి సంఘటనను విశ్వాస పరీక్షగా దెవుడు నియమిస్తాడు అని చూడగలగాలి.

ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున, మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. (హెబ్రీ 12:1).

Share