Select Page
Read Introduction to James యాకోబు

 

మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.

 

శోధనలు (శ్రమలు)

శోధన (శ్రమ) అనగా పరీక్ష, నిరూపణ, యత్నించుట. ఒక క్రీడాకారుడు ఉత్తమముగా ప్రదర్శించుటకు తనకు తాను శోధించుకోవాలి. తన శారీరిక బలమును మెరుగుపర్చుకొనుటకు బరువులను నెడుతాడు. తన  గుండెకు రక్తప్రసరణవ్యవస్థ మెరుగ్గా పనిచేయునట్లు పరుగెత్తుతాడు. తన శరీరము నుండి గరిష్ట ఫలితము కొరకు తన శరీరమును శొధించుకొంటాడు. దేవుడు మన నుండి గరిష్ఠ  ఫలితము కొరకు తీవ్రమైన భారము క్రింద మనలను ఉంచుతాడు.

నియమము:

అనేక శ్రమలు దేవుని ద్వేషముకు గుర్తుకాదు కాని క్రీస్తు స్వారూప్యముకు మనలను పరిణతి చేయడానికి దెవుడు ఉద్దేశించినవి.

అన్వయము:

శ్రమలు మనము నమ్మకముగా, యధార్ధముగా జీవించడానికి నేర్పిస్తాయి. దేవుని మీద ఆధారపడడానికి దోహదం చేస్తాయి.

శ్రమలు దెవుని ద్వేషానికి గుర్తు కాదు కాని, మన వృద్ధి మీద తన ఆసక్తికి గుర్తు. ఉన్నత శీలముగల క్రైస్తవులు లొతైన నీటిలొనికి వెళ్తారు. యోసేపుకు శ్రమపట్లగల వైఖిరి, తన జీవితముపట్ల దేవునికి గల ప్రణాళికను స్వీకరించుట. 

మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. (ఆది 50:20).

ఆగ్రహము, స్వీయ జాలి, స్రమ మీద ద్వేషము బలహీనమైన విశ్వాసాన్ని కనుపరుస్తాయి. శ్రమలొ దెవుని మీద ఆనుకొను వ్యక్తి, బలమైన విశ్వసమును కనుపరుస్తూ, దేవుడు ఒక్ ఉద్దెశము కలిగిఉన్నడు అని చూపుచున్నడు.  

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. (రోమా  8:28).

తన నిరూపణ కొరకు, దేవుడు ప్రతి శ్రమను మనజీవితములొ ఉంచుతాడు. పరిస్తితులు తారుమారైనప్పుడు, శ్రమలొ సరైన వైఖిరి కలిగిఉండుట దేవుని పట్ల మన విశ్వాసమునకు ప్రతీక. దేవుని ప్రణాలిక పట్ల నమ్మకము బలమైన, పరిణితి చెందిన విశ్వాసులను తయారుచేస్తుంది. అట్టి క్రైస్తవులు అన్నీ శ్రమలు దేవుని  అసమ్మతికి కాదు కాని వారి విశ్వాస ప్రామాణికతకు గుర్తు అని తెలుసుకున్న వారు. శ్రమకు మనము ఏ విధముగా స్పందిస్తామో మన విశ్వాసము యొక్క బలమును చూపుతుంది.

Share