మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.
శోధనలలో పడునప్పుడు
“శోధనలలో పడునప్పుడు” అంటే శోధనలతో చుట్టబడినప్పుడు అని అర్ధం. క్రైస్తవులు కొన్నిమార్లు శ్రమలతో చుట్టబడిన వారుగా బావిస్తారు.
శ్రమలు చలనము, ప్రభావము రెండింటినీ కలిగిఉన్నవి. క్రైస్తవులకు శ్రమలు అనుకోని సమయములో వచ్చినప్పుడు ఎంతో గొప్ప కష్టాలను ఎదుర్కుంటారు. మన స్వకృతముగా ఆ శ్రమలలో పడము. మన వ్యక్తిగత పాపము ఫలితముగా ఆ శ్రమ రాలేదు కాని, దేవుని వలన మన జీవితములో పెట్టబడింది.
నియమము:
మన స్వకృతమువలన కాక తన ప్రణాళిక వలన శ్రమలను దేవుడు మన జీవితములో అనుమతిస్తాడు.
అన్వయము:
శ్రమను మనము నివారించినప్పుడు అనేకమంది మహానందమముగా భావిస్తాము. మనలో కొందరు మన బుద్ధిహీనత వలన శ్రమలోపడుతాము. శ్రమ మనము “పడునది”. ఆ శ్రమ మనము చేసుకున్నదికాదు, దేవుడు అనుమతించినది.