నా సహోదరులారా,… మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.
మహానందమని
మన శ్రమలలో ఆనందము యొక్క పరిమాణము “మహా” . మన జీవితములోనికి వచ్చు యే శ్రమనైనాయినా, అసాధారణమైనదిగా చూడకూడదు. ప్రతిశ్రమను దేవుడు మన జీవితములో ఒక ఉద్దేశముతో ఉంచుతాడు. మన సమస్యలనుగూర్చి ఫిర్యాదు చేయడానికి బదులుగా, మొత్తముమీద మనము వాటిలో ఆనందిస్తాము.
క్రైస్తవులు జీవితాన్ని ఆనందించే ఆనందింపని అనుభవాలుగా వేరుచేయకూడదు. క్రైస్తవులుగాఉన్న మన జీవితములోనికి వచ్చు ప్రతిదీ ఆనందించదగినదే.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. (హెబ్రి 12:1-2).
నియమము:
శ్రమలో ఆనందించడము విశ్వాసియొక్క ప్రాధమిక వైఖరి.
అన్వయము :
ఆనందము, సంతోషముల భేదం ముఖ్యమైనది. మనకు అనుకూలముగా జరిగేపరిస్తితులపైన సంతోషము ఆదారపడుతుంది. “సంతోషము ” అనే పదము పరిస్తితి అనే మూల పదము నుండి వస్తుంది. “జరుగుట” , “సంతోషము” ఒకే మూల పదము కలిగి ఉన్నవి. తీవ్రమైన పరిస్తితులు ఎదురైనప్పుడు మనము సంతోషముగా ఉండలేము, కారణం పరిస్తితులు బాగుగా లేవు కాబట్టి. అయినప్పటికి ప్రతికూల పరిస్తితులలో మనము ఆనందంను కలిగిఉండగాలము, కారణం మన జీవితానికి దేవుడు ప్రణాళిక కలిగిఉన్నాడు. పరిస్తితికి సంధార్బానీకి సంబంధములేకుండా మన ఆత్మ యొక్క అంతరంగ చలనమే ఆనందము.
శ్రమ అనేది ఆనందము కాదు, కానీ దేవుని సార్వభౌమ హస్తమే దానిని నా జీవితములో ఉంచింది అని తెల్సుకోవడమే ఆనందము.
ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి (ఆపో 5:41).
ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు,చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు. (1 పేతురు 1:6-9).
ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగు చున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతో షించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి. (1 పేతురు 4:12-13).