Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

                                                                                       

సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి.

 

జ్ఞానము కలిగి నడుచుకొనుడి.

మన విశ్వాసాన్ని పంచుకునే విషయానికి వస్తే, మనం జ్ఞానం వినియోగించాలని దేవుడు ఆశిస్తాడు. మన విశ్వాసాన్ని మనం పంచుకొను విధానము, వారు క్రైస్తవ మతం పట్ల వారి ఆలోచనలను మరింత పక్షపాతం చూపవచ్చు. సాక్ష్య శైలి అనునది క్రీస్తును తిరస్కరించడానికి వారికి ఒక సందర్భం ఇవ్వవచ్చు.

క్రైస్తవేతరుల ముందు బాధ్యతాయుతంగా (“జ్ఞానము కలిగి”) జీవించాల్సిన బాధ్యత క్రైస్తవునికి ఉంది. వారి పాక్షికదృష్టికి మనం సున్నితంగా ఉండాలని దేవుడు ఆశిస్తాడు. మత్తయి 10:16 “ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి”. గొర్రెలు తోడేళ్ళకు వ్యతిరేకంగా ఏ ఆశను కలిగి ఉన్నాయి? తోడేళ్ళు ఇక్కడ క్రైస్తవేతరులు. జ్ఞానం లేకుండా క్రైస్తవుడు వారిని క్రీస్తుకు గెలవలేడు. మనకు అవసరమైన జ్ఞానాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు,

యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము;

పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. (సామెతలు 9:౧౦)

మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్ర హింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు. (యాకోబు 1:5)

నియమము:

క్రీస్తును యెరుగని వారితో వ్యవహరించేటప్పుడు మనం జ్ఞానాన్ని ఉపయోగించాలని దేవుడు కోరుకుంటాడు.

అన్వయము:

మనము క్రైస్తవేతరులను క్రీస్తుకొరకు గెలవబోతున్నట్లయితే, ప్రజలను వారి సానుకూలత వైపు సంప్రదించాలి. క్రైస్తవేతరుల ముందు జ్ఞానయుక్తమైన నడక వారి దృష్టికలోని క్రైస్తవ్యము గురించి పుటలుగా  మాట్లాడుతుంది.

Share