Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

ప్రార్థనయందు నిలుకడగా ఉండి కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి.

 

మెలకువగా ఉండుడి

క్రొత్త నిబంధనలోని అనేక భాగాలు ప్రార్థనలో మెళుకువతో సమ్మేళనము చేస్తాయి

ప్రభువైన యేసు ప్రార్థన మరియు మెళుకువ ఆలోచనలను మత్తయి 26:41 లో అనుసంధానించాడు.  “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి” ప్రార్థన విషయానికి వస్తే శరీరము బలహీనంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది!

ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపననుచేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి. (ఎఫెస్సీ 6:18)

అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. (1పేతురు 4:7)

నియమము:

విశ్వాసి ప్రార్థనలో అప్రమత్తంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు.

అన్వయము:

ఒక విశ్వాసి ప్రార్థనకు వెళ్ళినప్పుడు అతను అపవాది యొక్క ప్రత్యేక లక్ష్యం అవుతాడు. మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు వాడు చెడు ఆలోచనలను సూచిస్తాడు. మనం ప్రార్థన చేయమని వాడు కోరుకోడు కాబట్టి వాడు మనల్ని నిద్రపోయేలా చేస్తాడు. మనం ప్రార్థించేటప్పుడు వాడు మనసులో ఆత్రుత ఆలోచనలను ఉంచుతాడు. ప్రార్థనను ఉపశమనం పొందవలసి ఉన్నప్పటికీ, ప్రార్థనలో మనం కోపంగా, ఆగ్రహిస్తు, ఆందోళన చెండు అవకాశము కలదు (ఫిలి. 4:6,7). అపవాది ప్రార్థనకు అతీంద్రియ శత్రువు.

శరీరస్వభావము యొక్క గుర్తులలో ఒకటి ప్రార్థన లేమీ (యాకోబు 4:1). శరీరస్వభావము అనేది ఒక క్రైస్తవుడు మాత్రమే కలిగిఉండగల వ్యాధి. మనము ప్రార్థన చేయడానికి ఇష్టపడనందున, దేవుడు మన జీవితాల్లో ప్రతికూలతను తెస్తాడు. కొంత సంక్షోభం వచ్చేవరకు మనము ప్రార్థనలో పోరాడము. ఎవరూ అనారోగ్యంతో లేరు, మా ఆర్థిక పరిస్థితులు బాగుగా ఉన్నాయి, కాబట్టి నేను ఎందుకు ప్రార్థించాలి? సంక్షోభం వచ్చినప్పుడు మనం చాలా అనర్గళంగా ప్రార్థించవచ్చు!

Share