దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి.
దాసులారా
పౌలు కాల౦లో 60,000,000 బానిసలు ఉన్నారు. ఆ రోజు పని శక్తి వాళ్ళది. బానిసత్వ వ్యవస్థకి వ్యతిరేకంగా బానిసలు పైకి వచ్చి తిరుగుబాటు చేయాలని పౌలు ఎన్నడూ ఆజ్ఞాపించలేదు. తాము ఉన్నపరిస్థితిలో ఎక్కడ ఉన్నా తాము బెస్ట్ గా ఉండాలని ప్రోత్సహించారు. తరచుగా బానిసలు రోమన్ సామ్రాజ్య నాయకులు మరియు నిర్వాహకులుగా ఉండేవారు.
ఏ పరిస్థితుల్లోనైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ సంస్కృతిలోనూ అయినా పని చేయగల విధంగా దేవుడు క్రైస్తవత్వాన్ని చేశాడు. బానిసత్వపు క్రూరత్వం నివారణకు సమాజంలో ఆనాడు చోటు లేదు. ఒక బానిస యజమాని చట్టముకు భయపడకుండా తాను ఏ విధంగా చేయాలనుకుంటే ఆవిధముగా బానిసను చేసేవాడు. వారు తమ రోడ్ల గురించి గొప్పలు చెప్పుకునే వారు కానీ బానిసత్వం ప్రతిచోటా ప్రబలమైంది. బానిసత్వం లేని వాతావరణంలో క్రైస్తవం వర్ధిల్లింది. క్రైస్తవత్వ౦ గతిశీల౦ కావడానికి వాతావరణ౦ ఏ మాత్ర౦ ఆటంక౦ కాలేదు. ఆ వాతావరణంలో సువార్త విలసిల్లింది.
క్రైస్తవత్వము మొదటి శతాబ్దములో క్రొత్త, చిన్న వ్యవస్థగా ఉండేది. కాలక్రమంలో క్రైస్తవత్వపు ప్రభావం బానిసత్వాన్ని అంతం చేసింది.
క్రీస్తులో నిరీక్షణ ఉ౦దని ఈ బానిసలు విన్నప్పుడు, వేలమంది క్రీస్తు వైపు తమ రక్షకునిగా తిరిగారు. వారు జీవించుటకు ఒక ప్రయోజనం మరియు వ్యక్తిని కనుగొన్నారు. సువార్త ఎల్లప్పుడూ అర్భకునికి విజ్ఞప్తి చేసింది. వారు వినుటకు వినయంగా ఉంటారు. స్వయంతృప్తికలవారు సువార్త అవసరం లేదు అన్నట్లుగా ఉంటారు.
చాలామ౦ది బానిస యజమానులు కూడా క్రీస్తుకు వద్దకు వచ్చారు. కొంతమంది సంపన్నులు తమను తాము స్వయం సమృద్ధులుగా దృష్టి౦చుకోలేదు. వారిలో కొందరు క్రీస్తు నొద్దకు వచ్చారు అందుకై దేవునికి కృతజ్ఞతలు. వారు వచ్చినప్పుడు వారు తరచుగా క్రీస్తు కారణం లో గొప్ప నాయకులుగా ఉండిరి.
ఈనాడు ఈ లేఖనభాగముకు సంబంధించిన అన్వయము ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఉద్యోగులకు సంబందించినదిగా ఉంటుంది.
నియమము:
పరిస్థితి ఎలా ఉన్నా క్రీస్తులో నిరీక్షణ ఉన్నది.
అన్వయము:
ఏ ఆశా లేని పరిస్థితిలో నిన్ను నీవు కనుగొన్నావా? మీరు క్రీస్తును గురించి ఆలోచించారా? ఆయన మీకు ఉద్దేశాన్ని, శాంతిని ప్రసాదిస్తారు.
ఒక వ్యక్తి దీని ద్వారా క్రైస్తవుడిగా మారవచ్చు:
1) తన పాపము అహంకారం లేదా కోపం వంటి పాపము కూడా పరిశుద్ధ దేవుణ్ణి ఉల్లంఘించినదని గుర్తిస్తూ;
2) సిలువపై తన మరణము ద్వారా యేసుక్రీస్తు ఆ పాపానికి మూల్యము చెల్లించినట్లు అర్ధం చేసుకోవటం ద్వారా; మరియు
3) మీ పాపముకై క్రీస్తు మరణముపై వ్యక్తిగతంగా విశ్వాసాన్ని ఉంచడం. ఈ రోజు అలా చేస్తారా?